हिन्दी | Epaper

America: ఇరాన్ మళ్లీ అణు ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు..జేడీ వాన్స్

Vanipushpa
America: ఇరాన్ మళ్లీ అణు ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు..జేడీ వాన్స్

అణుస్ధావరాలపై దాడులు తర్వాత అమెరికా సీజ్ ఫైర్ ప్రకటన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు చర్యకు దిగారు. ఇరాన్‌లోని ముఖ్యమైన మూడు అణు స్థావరాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్పాహాన్ పై అమెరికా(America) భారీ వైమానిక దాడులు జరిపింది. అనంతరం, తమ ముఖ్య లక్ష్యం నెరవేరిందని పేర్కొంటూ సీజ్ ఫైర్(CEASEFIRE) (కాల్పుల విరమణ) ప్రకటన చేశారు.
ఇరాన్ అణుపరిశ్రమపై అమెరికా స్పష్టమైన హెచ్చరిక
సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వారి ప్రకారం, ఈ దాడుల వెనుక ఉద్దేశం ఎటువంటి విధ్వంసం కాదు, కానీ ఇరాన్‌ను అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే అని స్పష్టం చేశారు.

US: ఇరాన్ మళ్లీ అణు ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు..అమెరికా హెచ్చరిక
US: ఇరాన్ మళ్లీ అణు ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు..అమెరికా హెచ్చరిక

“తిరిగి తయారీకి యత్నిస్తే తీవ్రంగా ఎదుర్కొంటారు” – జేడీ వాన్స్
జేడీ వాన్స్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇరాన్ తిరిగి అణ్వాయుధాల తయారీకి దిగితే, అమెరికా శక్తివంతమైన సైనిక బలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. “మేము ఇరాన్‌తో యుద్ధంలో లేము. కానీ వారి అణ్వాయుధాల ప్రయత్నాలను మాత్రం సహించం” అని చెప్పారు.
యురేనియాన్ని శిథిలాల్లో పాతేశాం – వైస్ ప్రెసిడెంట్ క్లూ
ఇరాన్ వద్ద ఉన్న యురేనియాన్ని శిథిలాల కింద పాతేశామని, కానీ దాని పూర్తి వివరాలను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేమని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది ఒక రకంగా అమెరికా చారిత్రక దాడుల్లో భాగంగా భావించవచ్చు.
ఇరాన్ అణుస్ధావరాల స్థితి అస్పష్టంగా మిగిలింది
ఫోర్డో, నతాంజ్, ఇస్పాహన్ స్థావరాలపై దాడులు జరిగినా, అవి పూర్తిగా ధ్వంసమయ్యాయా? లేదా మళ్లీ పునఃప్రారంభం అయ్యే అవకాశముందా? అనే అంశంపై స్పష్టత లేదు. ఇది భవిష్యత్తులో ఇరాన్ తిరిగి అణుబాంబుల తయారీకి యత్నించవచ్చన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే బలమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. తాము ఇరాన్ తో యుద్ధంలో లేమని, అయితే వారి అణ్వాయుధ కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మాత్రం అమెరికా దాడులను విజయవంతంగా ఉపయోగించుకుని, ఇరాన్ అణు ప్రోగ్రాంను అడ్డుకున్నామని ప్రకటించింది.

Read Also: Trump: ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరాన్, ఇజ్రాయెల్ లకు ట్రంప్ హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

బాబ్ ఎల్-మాందెబ్ జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

ఉద్యోగుల జీతాల్లో 30% వరకు కోత!

ఉద్యోగుల జీతాల్లో 30% వరకు కోత!

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

📢 For Advertisement Booking: 98481 12870