US vs Iran: అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ దేశం తమ దాడులకు భయపడి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జి-7 (G-7) దేశాల ప్రతినిధులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ‘ఆక్సియోస్’ (Axios) తన నివేదికలో పేర్కొంది.
Read Also:Trump Putin Viral Photo: పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

ఇరాన్‌లో నిర్ణయాలు తీసుకునే నేతలే లేరు
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో ఉందని, అక్కడ యుద్ధాన్ని ముందుకు నడిపించే నాయకత్వమే కరువైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా జరిపిన దాడుల ధాటికి ఇరాన్ ఉన్నతాధికారులు మరియు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఎవరూ మిగిలి లేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “అక్కడ లీడర్ అంటూ ఎవరూ లేరు, అందుకే లొంగిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించే నాథుడే కరువయ్యారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరిన తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ తన పతనాన్ని అంగీకరించే స్థితికి చేరుకుందని, అయితే దానిని ప్రకటించడానికి సరైన నాయకత్వం లేకపోవడమే ప్రస్తుత జాప్యానికి కారణమని ట్రంప్ జి-7 నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే త్వరలోనే మధ్యప్రాచ్యంలో భారీ మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: