हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

ట్రంప్ సంచలన నిర్ణయం: క్రిప్టో కరెన్సీలకు పట్టం

Vanipushpa
ట్రంప్ సంచలన నిర్ణయం: క్రిప్టో కరెన్సీలకు పట్టం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఖరారైన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టడానికి మునుపే అనేక క్రిప్టోలు భారీ ర్యాలీని నమోదు చేశాయి. ట్రంప్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా క్రిప్టో కరెన్సీలకు ప్రాధాన్యతను అందిస్తున్నట్లు ప్రస్తుత చర్యలను చూస్తుంటే అర్థం అవుతోంది.
ఎంపికలో రిపుల్, సోలానా, కార్డానోలు
వివరాల్లోకి వెళితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మూడు క్రిప్టో కరెన్సీల పేర్లను ఎంపిక చేసుకున్నారు. వీటి ద్వారా యూఎస్ క్రిప్టో స్ట్రాటజీ రిజర్వును ఆదివారం ప్రకటించారు. ఇందులో రిపుల్, సోలానా, కార్డానోలు ప్రణాళికలో ఎంపికయ్యాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా మార్కెట్లలో మెగా ర్యాలీ నెలకొంది. ఈ డిజిటల్ కరెన్సీల ధరలు దాదాపు 10 నుంచి 35 శాతం మధ్య భారీ పెరుగుదలను చూశాయి.

ట్రంప్ సంచలన నిర్ణయం: క్రిప్టో కరెన్సీలకు పట్టం


మోసాలను నివారించటం కోసం
డిజిటల్ ఆస్తుల కోసం వ్యూహాత్మక రిజర్వ్‌ను ఏర్పాటు చేయాలని అధ్యక్ష వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించిన ట్రంప్ జనవరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత తాజా చర్య తీసుకున్నారు. అమెరికాను “క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్”గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా.. మోసాలను నివారించటం, మనీలాండరింగ్ నిరోధక చర్యలపై దృష్టి సారించిన మునుపటి పరిపాలన నియంత్రణ చర్యల నుంచి ట్రంప్ పూర్తిగా నిష్క్రమించినట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీల రేట్లు భారీగా క్షీణించినప్పటికీ.. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ విధాన మార్పు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి రేకెత్తించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు లేదా మరింత అనుకూల క్రిప్టో చొరవలతో జతచేయబడితే ఇది మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి.

వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్‌

అయితే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ ఖచ్చితమైన నిర్మాణం అస్పష్టంగానే ఉంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరమా లేదా US ట్రెజరీ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అమలు చేయవచ్చా అనే అంశాలపై న్యాయ నిపుణులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. చట్ట అమలు చర్యల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆస్తులను రిజర్వ్‌లో చేర్చవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని ముందు గడచిన శుక్రవారం ట్రంప్ మొట్టమొదటి వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహించటం గమనార్హం. దీని ద్వారా ట్రంప్ తన పరిపాలన సమయంలో క్రిప్టోలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అందరి దృష్టి రాబోయే నియంత్రణ పరిణామాలు, పరిశ్రమపై వాటి ప్రభావంపై కొనసాగుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870