Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైపు మరిన్ని అమెరికా యుద్ధ నౌకలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నానని, అయితే అవసరమైతే వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో యుద్ధ నౌక కూడా ఇరాన్ వైపు వెళ్తోందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి ముందుకు వస్తుందని ఆశిస్తున్నానని, వారు దీనికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు తనకు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులు పలుమార్లు తనను సంప్రదించినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

మరోవైపు, అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, (Donald Trump) ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇరాన్‌పై ఎప్పుడైనా దాడులు చేయవచ్చన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: