Trump Putin Viral Photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలకు ట్రంప్ ఏప్రిల్ 11 వరకు వెసులుబాటు కల్పించారు. దీనివల్ల యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోని డెమోక్రటిక్ నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
Read Also: Tomato Price Hike: దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు
వైరల్ అవుతున్న ‘పెంపుడు కుక్క’ ఎడిటెడ్ ఫోటో
ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ కార్యాలయం చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్‌ను ఒక పెంపుడు కుక్కపిల్లలా మెడకు తాడు కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఒక ఎడిటెడ్ ఫోటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: