हिन्दी | Epaper

Switzerland: మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

Vanipushpa
Switzerland: మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలు కరీన్‌ కెల్లర్‌ సుట్టన్‌ తనతో మాట్లాడిన తీరు బాగోలేదని, అందుకే ఆ దేశంపై అదనంగా 9 శాతం టారిఫ్‌లు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొనడం ప్రపంచాన్ని స్మయపరిచింది. ట్రంప్ చర్యలు సామ్రాజ్యవాద పోకడకు పరాకాష్టగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌పై 30 శాతం సుంకాలు విధించడంతో నాకు కాల్‌ వచ్చింది అని.. నేను కెల్లర్‌ను స్విస్‌ ప్రధాని అని భావించానని ట్రంప్ ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఫోన్ కాల్ లో తమది చాలా చిన్నదేశమని, అన్ని సుంకాలు భరించలేమని.. సుంకాలు తగ్గించాలని పదే పదే స్విస్ ప్రతినిధి కోరిందని ట్రంప్‌ వెల్లడించారు.

Read Also: Yash: ‘టాక్సిక్’ మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

Switzerland: మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌
Switzerland: మాట తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల ను పెంచిన ట్రంప్‌

ఆమె చాలా దూకుడుగా మాట్లాడింది: డొనాల్డ్ ట్రంప్

అయితే స్విస్ నాయకురాలు తనతో మాట్లాడిన విధానం నచ్చకపోవడంతో స్విట్జర్లాండ్‌(Switzerland)పై అదనంగా తొమ్మిది శాతం సుంకాలను పెంచాలని ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్విస్ నాయకురాలు తనతో మాట్లాడిన విధానం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. అలాగే తనతో ఫోన్ లో మాట్లాడిన స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలు కరీన్‌ కెల్లర్‌ సుట్టన్‌ ను ఆ దేశ ప్రధాని అనుకున్నట్లుగా ట్రంప్ చెప్పడం మరింత అశ్చర్యపరిచింది. వాస్తవానికి స్విట్జర్లాండ్‌కు ప్రధాన మంత్రి లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు లేరు. బదులుగా ఆ దేశం ఏడుగురు సభ్యుల ఫెడరల్ కౌన్సిల్ ద్వారా సమిష్టిగా పరిపాలించబడుతుంది. స్విస్ పాలకవర్గం అవగాహాన లేనట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు ఉండటం అశ్చర్యపరిచింది.స్విట్జర్లాండ్ పై నేను 30 శాతం సుంకం విధించాను, అది చాలా తక్కువ.. అప్పుడు నాకు స్విట్జర్లాండ్ ప్రధానమంత్రి నుండి అత్యవసర కాల్ వచ్చింది, ఆమె చాలా దూకుడుగా మాట్లాడిందని..పదేపదే ‘సార్, మాది చిన్నదేశం..ఇంత సుంకాల పెంపు భరించలేమంటూ చెప్పుకొచ్చిందని, ఆమె వాయిస్ బాగుండటంతో నేను ఆమెను ఫోన్ నుండి దూరం చేయలేకపోయాను అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆమె నాతో ఫోన్ లో మాట్లాడిన విధానం నాకు నిజంగా నచ్చలేదు అని, అందుకే సుంకాల తగ్గింపుకు బదులుగా నేను దానిని 30శాతం నుంచి 39 శాతానికి పెంచాను అని ఆయన ట్రంప్ వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

📢 For Advertisement Booking: 98481 12870