ఇండియా – అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న వేళ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని తెలిపారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ చాలా టఫ్నెగోషియేటర్ అని వ్యాఖ్యానించారు. మోడీ చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్అన్నారు.’భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల, అమెరికా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోంది‘ అని జేడీ వాన్స్చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం, కార్మికులకు హాని కలిగించే అన్యాయమైన పద్ధతులను తొలగించడం, మొదలైన విషయాలపై భారత్‌తో చర్చిస్తున్నామని జేడీ వాన్స్ వివరించారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌తో పాటుగా జపాన్, కొరియా తదితర దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ వెల్లడించారు. కాగా, ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్డీల్కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు.

వస్తువులకు
వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజాగా, జేడీ వాన్స్ ప్రకటనతో త్వరలోనే భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందిస్తూ, ఈ దాడి భారత ప్రజలపై తీవ్రమైన దాడిగా అభివర్ణించారు.జెడి వాన్స్ మాట్లాడుతూ, “భారత్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందన్నది ప్రపంచ దేశాల కంటపడి ఉంది. కానీ ఈ ప్రతిస్పందన ప్రాంతీయ యుద్ధ స్థితికి దారి తీయకూడదనే మా ఆకాంక్ష. పాకిస్థాన్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఉగ్రవాదులపై న్యూఢిల్లీ చేపడుతున్న చర్యలకు పాక్ సహకరించాలి,” అని సూచించారు.పహల్గాంలో బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు సతీసమేతంగా భారత్ పర్యటనలో ఉన్నారు. అప్పటికే ఆయన ఈ దాడిని ఖండిస్తూ, “భారత్ ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది,” అని హామీ ఇచ్చారు.
Read Also: USA: రియల్ ఐడీ లేకపోతే విమానంలో కి నో ఎంట్రీ