हिन्दी | Epaper

Tharoor: పాక్ తో చర్చలు ఉండవు : శశిథరూర్

Vanipushpa
Tharoor: పాక్ తో చర్చలు ఉండవు : శశిథరూర్

పాకిస్థాన్​తో చర్చలపై భారత దౌత్య బృందానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(ShashiDharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్థాన్​(Pakistan) తో చర్చలు ఉండవని గుప్పించారు. పాక్ తమ గడ్డపై ఉగ్రవాద శక్తులను నియంత్రించకపోతే భారత్ ఇప్పటిలాగే మళ్లీ దాడులు చేస్తుందని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌, పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదం గురించి వివరించేందుకు శశిథరూర్ నేతృత్వంలో భారత దౌత్య బృందం అమెరికాలో పర్యటిస్తోంది. అక్కడి నేషనల్ ప్రెస్ క్లబ్‌లో శశిథరూర్ మాట్లాడారు.

Tharoor : పాక్ తో చర్చలు ఉండవు : శశిథరూర్
Tharoor : పాక్ తో చర్చలు ఉండవు : శశిథరూర్

ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో మార్పు లేదు
“మన తలపై తుపాకీ గురిపెట్టేవారితో చర్చలు ఉండవు. పాక్ గురించి ఈ స్పష్టమైన వైఖరి భారతదేశానికి ఉందని అమెరికా అర్థం చేసుకుందని నేను భావిస్తున్నాను. పాక్​తో భారత్ చర్చలు జరపలేదని కాదు. తలపై తుపాకీ గురిపెట్టి మాట్లాడే వ్యక్తులతో మేము సంభాషించం. మీ పొరుగువారు మీ పిల్లలపై కుక్కలతో దాడి చేయించి మాట్లాడుకుందాం అంటే ఊరుకుంటారా. వారు దాడి చేసిన కుక్కలను దూరంగా ఉంచే వరకు మీరు వారితో మాట్లాడతారా?. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని అమెరికా ప్రతినిధులను తెలయజేయడానికి అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం అమెరికాలో ఉంది.”
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన
వాణిజ్యాన్ని ఉపయోగించి పాక్, భారత్ మధ్య యుద్ధాన్ని ఆపామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ తోసిపుచ్చారు. అమెరికా నుంచి ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​కు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని గుర్తు చేశారు. అయితే, ఆ కాల్స్‌లో ఎప్పుడూ వాణిజ్యాన్ని ప్రస్తావించలేదని చెప్పారు.
అమెరికా అధ్యక్ష పదవిపై భారతదేశానికి అపారమైన గౌరవం ఉంది. కానీ న్యూదిల్లీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఎవరినీ మధ్యవర్తిత్వం చేయమని కోరలేదు. ఎవరూ యుద్ధం ఆపమని చెప్పాల్సిన అవసరం లేదు. పాక్ ఉగ్రవాద ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం, మేము బలప్రయోగ భాషను ఉపయోగిస్తాం. కాల్పుల విరమణ కోసం మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదు అని శశిథరూర్ అన్నారు.
“పలు దేశాల విదేశాంగ మంత్రులు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడికి కాల్స్ చేశారు. ఈ విషయంలో అమెరికా అత్యంత చురుగ్గా వ్యవహరించింది. విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో భారత్ తో మాట్లాడారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధాని మోదీకి కాల్ చేశారు. అని శశిథరూర్ తెలిపారు.

Read Also: http://Musk-Trump Fight: : మస్క్‌ కు రూ.12.8 లక్షల కోట్ల నష్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870