हिन्दी | Epaper

సదస్సు ఏమో పర్యావరణ కోసం.. చేస్తున్నది మాత్రం చెట్ల నరికివేత!

Vanipushpa
సదస్సు ఏమో పర్యావరణ కోసం.. చేస్తున్నది మాత్రం చెట్ల నరికివేత!

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఉద్దేశించిన సదస్సు కోసం బ్రెజిల్ పచ్చటి చెట్లను నరికిస్తోంది.. పచ్చదనం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పే సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తూ అదే పచ్చదనాన్ని తొలగిస్తోంది. విరివిగా మొక్కలు నాటాలని ప్రపంచానికి సందేశం ఇచ్చే సదస్సు కోసం ఇలా అడవులను నాశనం చేస్తూ ఏం చెప్పాలనుకుంటోందని బ్రెజిల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ అడవులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.. వాతావరణంలోని కర్బన ఉద్గారాలను గ్రహించి భూమి వేడెక్కకుండా చూడటంలో, జీవవైవిధ్యంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

సదస్సు ఏమో పర్యావరణ కోసం.. చేస్తున్నది మాత్రం చెట్ల నరికివేత!

తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు

పర్యావరణ పరిరక్షణలో కీలకమైన అమెజాన్ అడవులను ధ్వంసం చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 30న బ్రెజిల్ లో క్లైమేట్ సమిట్ జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారుల అంచనా. భూమి మీద నానాటికీ పెరిగిపోతున్న ఉద్గారాలు, కాలుష్యంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ఉద్దేశం. ఈ సదస్సు నిర్వహణ కోసం బ్రెజిల్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రతినిధుల బస, రాకపోకలు, సమిట్ వేదిక కోసం అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం.. అక్కడ ప్రతినిధుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

వందలాది పచ్చని చెట్లు నేలమట్టం

ఇందులో భాగంగా ప్రతినిధుల రాకపోకలు సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి కొత్తగా ఓ రోడ్డును నిర్మిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రోడ్డు నిర్మాణం కోసం వందలాది పచ్చని చెట్లను నేలమట్టం చేయడంపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రోడ్లు తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్ తీరు వాతావరణ సదస్సు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని మండిపడుతున్నారు. ‘పర్యావరణ సదస్సును అమెజాన్ అడవుల్లో నిర్వహిస్తున్నాం నిజమే. కానీ, అమెజాన్ అడవుల కోసం కాదు కదా’’ అంటూ ఆ దేశ అధ్యక్షుడు సమర్థించుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

📢 For Advertisement Booking: 98481 12870