हिन्दी | Epaper

MBBS Student: వియత్నాంలో తెలంగాణ మెడికో దుర్మరణం

Anusha
MBBS Student: వియత్నాంలో తెలంగాణ మెడికో దుర్మరణం

తెలంగాణ,కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌కు చెందిన యువ వైద్య విద్యార్థి అష్రిత్ వియత్నాం దేశంలోని కాన్ థో నగరంలో దుర్మరణం చెందాడు.MBBS మూడో సంవత్సరం చదువుతున్న అష్రిత్ అనే 21 ఏళ్ల విద్యార్థి బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి చెందాడు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్- ప్రతిమ దంపతుల కుమారుడు అర్షిద్ అష్రిత్ (21). అష్రిత్ వియత్నాం దేశంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే బుధవారం తెల్లవారుజామున స్నేహితుడితో 150 సీసీ బైక్ పై అతివేగంగా వెళ్తూ ఒక ఇంటి గోడను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అష్రిత్(Ashrith) అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

తల్లిదండ్రులను ఓదార్చారు

ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున పెద్దగా రద్దీలేని రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ ఒకటి కనిపించింది. బైక్ నేరుగా గోడను ఢీ కొట్టడం వీడియోలో కనిపించింది. అనంతరం బైక్‌పై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడటం వీడియోలో చూడొచ్చు.తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ పి హరీష్ బాబు(P Harish Babu) ఆశ్రిత్ ఇంటికి చేరుకుని అతడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి వీలు కల్పించాలని కోరారు.

Read Also: Telangana: డస్సాల్ట్ ఏవియేషన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870