Syrian army : సిరియాలోని Aleppo నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిరియా సైన్యం మరియు కుర్దిష్ నేతృత్వంలోని Syrian Democratic Forces (SDF) మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో అధికారులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సిరియా అధికారులు తెలిపారు.
అలెప్పో అంతర్గత భద్రతా కమాండ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, అష్రఫియెహ్, షేఖ్ మక్సూద్, బానీ జైద్, అల్-సిర్యాన్, అల్-హుల్లోక్ మరియు అల్-మైదాన్ ప్రాంతాల్లో “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” కర్ఫ్యూ అమలు చేస్తామని పేర్కొంది. నివాసితుల భద్రత కోసం, శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?
కర్ఫ్యూ అమలులో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి (Syrian army) కదలికలకు అనుమతి ఉండదని, ఎలాంటి మినహాయింపులు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. ఈ భద్రతా చర్యల ఉద్దేశ్యం ప్రాణాలు, ఆస్తులను కాపాడటమేనని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ వారంలో సిరియా సైన్యం మరియు SDF మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి అష్రఫియెహ్, షేఖ్ మక్సూద్ ప్రాంతాల నుంచి లక్షకు పైగా పౌరులు తమ ఇళ్లను విడిచి వెళ్లినట్లు అలెప్పో మీడియా విభాగం డైరెక్టర్ తెలిపారు. గురువారం స్నైపర్ కాల్పుల మధ్య తన కుటుంబంతో పారిపోయిన 43 ఏళ్ల రానా ఇస్సా మాట్లాడుతూ, “చాలా మంది బయటకు వెళ్లాలనుకుంటున్నారు కానీ కాల్చివేస్తారనే భయం ఉంది” అని తెలిపారు. “మేం చాలా కష్టకాలం ఎదుర్కొన్నాం. నా పిల్లలు భయంతో వణికిపోయారు” అని ఆమె చెప్పింది.
మార్చి 2025లో కుదిరిన ఒప్పందం ప్రకారం, సిరియాలో ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతాలను నియంత్రిస్తున్న SDFను దేశపు ప్రభుత్వ సంస్థల్లో విలీనం చేయాలన్న చర్చలు నిలిచిపోవడంతోనే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: