हिन्दी | Epaper

Rahul Gandhi : రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఖరారు

sumalatha chinthakayala
Rahul Gandhi : రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఖరారు

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్‌ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన

రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ

ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్‌ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారన్నారు. ఆ వర్సిటీలోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్‌ సభ్యులతోను సమావేశమవుతారని వెల్లడించారు.

గతేడాది సెప్టెంబరులోమూడ్రోజులు యూఎస్‌లో రాహుల్‌ పర్యటన

ఇక, గతేడాది సెప్టెంబరులో రాహుల్‌ మూడ్రోజులు యూఎస్‌లో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాహుల్‌ రిజర్వేషన్లు, భారత్‌లో మతస్వేచ్ఛ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర దుమారం రేపాయి. సిక్కులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బీజేపీ ఆయన మాటలను ఖండించింది. విదేశాల్లో భారత్‌ పరువు తీస్తున్నారని మండిపడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

మరో జలసంధి మూసివేత ముప్పు, ప్రపంచానికి భారీ షాక్

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

కదలలేని స్థితిలో మొజ్తబా ఖమేనీ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

యుద్ధం మధ్య నెతన్యాహూ పై ఇరాన్ సంచలన ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870