Putin ukraine ceasefire : రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య వారం రోజుల పాటు కాల్పుల విరమణ జరగనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు Vladimir Putin అంగీకరించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump వెల్లడించారు.
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనడంతో, మానవతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపాలని తాను పుతిన్‌ను కోరినట్లు ట్రంప్ తెలిపారు. ఈ విజ్ఞప్తికి పుతిన్ సానుకూలంగా స్పందించి వారం రోజుల పాటు సీజ్‌ఫైర్ పాటిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం

అయితే ఈ కాల్పుల విరమణపై రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy స్పందిస్తూ, ఇరు దేశాలు ఎనర్జీ సీజ్‌ఫైర్ పాటించాలని సూచించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు ఆపాలని ఆయన కోరారు. ఈ ప్రతిపాదనపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: