हिन्दी | Epaper

Mogadishu: బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!

Vanipushpa
Mogadishu: బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!

విచిత్రమైన ఫోటో ఒకటి సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్​ అయింది. సముద్ర తీరంలో ఒక విమానం… కొంతమంది మోకాళ్ల లోతు నీళ్లలోనుండి నడుచుకుంటూ రావడం… సినిమా సన్నివేశంలా కనిపించిన ఈ దృశ్యం నిజంగా జరిగింది. సోమాలియా రాజధాని మొగాదిషులో జరిగిన ఈ అద్భుత ఘటనలో 55 మంది ప్రాణాలతో బయటపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైలట్ తీసుకున్న క్షణకాల నిర్ణయం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. మంగళవారం ఉదయం సోమాలియాలోని రాజధాని మొగాదిషు(Mogadishu) లో ఉన్న Aden Adde International Airport నుంచి బయలుదేరిన స్టార్‌స్కై ఏవియేషన్‌కు చెందిన ఫోకర్–50 విమానంలో గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని నడుపుతున్న పైలట్ సమస్యను గుర్తించి వెంటనే తిరిగి ల్యాండింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ విమానాశ్రయం, హిందూ మహాసముద్రతీరంలోనే ఉంటుంది. రన్​వేకు కొంచెం దూరంలోనే తీరం ఉండటం గమనార్హం.

Read Also: Tax: మీల్స్ పన్ను మినహాయింపు పెంపు ప్రతిపాదన

Mogadishu: బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!
Mogadishu: బీచ్‌లో దిగిన విమానం…తృటిలో తప్పించుకున్న ప్రయాణీకులు!

పైలట్​ చాకచక్యంలో విమానం అదుపు

సిబ్బంది తెలిపిన ప్రకారం, విమానం రన్‌వేను తాకినా, ఆగలేదు. అలాగే ముందుకు దూసుకెళ్లిన విమానం సముద్రం వైపు ప్రయాణించి హిందూ సముద్రపు బీచ్​లో ప్రవేశించింది. పైలట్​ చాకచక్యంలో విమానాన్ని అదుపు చేసి ఆపగలిగాడు. అలల మధ్య ఇసుకలో ఆగిపోయిన విమానం దృశ్యం అక్కడి ప్రజలను షాక్​కు గురిచేసింది. ఇక ప్రయాణీకుల పరిస్థితి చెప్పే అవసరం లేదు. తమ ప్రాణాలు గాల్లో కలిసాయనుకున్న వారందరూ నీళ్లలోనుండి బయటకొచ్చారు. వారికే కాదు, అందరికీ జరిగిందొక అద్భుత ఘటన. విమానంలో అయిదుగురు సిబ్బంది, 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా అమలు చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విధానాన్ని సిబ్బంది వెంటనే ప్రారంభించారు. రక్షణ వాహనాలు చేరుకునేలోపు ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చి బీచ్ మీదుగా నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

📢 For Advertisement Booking: 98481 12870