Google: గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?

Follow Us: Google News Daily Hunt
Google Rules
Google Rules
FONT SIZE
GET APP

సాధారణంగా మనం డబ్బు అవసరమైతే బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుంటాం. కానీ, గూగుల్ వంటి భారీ కంపెనీలకు వేల కోట్లు అవసరమైనప్పుడు.. అవి నేరుగా ప్రజల నుండి లేదా పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థల నుండి అప్పు తీసుకుంటాయి. దీనినే బాండ్లు అంటారు. సింపుల్‌ గా చెప్పాలంటే.. మీరు కంపెనీకి అప్పు ఇస్తారు. దానికి బదులుగా కంపెనీ మీకు ప్రతి ఏటా కొంత వడ్డీ చెల్లిస్తుంది. అప్పు తీసుకున్న కాల పరిమితి ముగిశాక మీ అసలు డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తుంది.

Read Also: Bangladesh: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

Google: గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?
Google: గూగుల్ వందేళ్ల బాండ్స్..దీని ప్లాన్ ఏంటి?

వందేళ్ల బాండ్ అంటే ఏంటి?

ఇప్పుడు గూగుల్ (Google)మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్’ ఒక వింతైన అప్పు చేస్తోంది. అది ఏకంగా 100 ఏళ్ల కాలపరిమితి ఉన్న బాండ్. అంటే గూగుల్ ఇప్పుడు తీసుకున్న అప్పును తిరిగి 2126వ సంవత్సరంలో చెల్లిస్తుంది! అప్పటివరకు ప్రతి ఏటా పెట్టుబడిదారులకు వడ్డీ కడుతూనే ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే వందేళ్ల తర్వాత టెక్నాలజీ ఎలా ఉంటుందో.. అసలు ఆ కంపెనీ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు. అయినా కూడా గూగుల్ మీద ఉన్న నమ్మకంతో చాలా మంది ఈ బాండ్లు కొనడానికి పోటీ పడుతున్నారు. ఈ అప్పు దేనికోసం? (AI , డేటా సెంటర్లు) గూగుల్ ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడానికి ప్రధాన కారణం ఏఐ (AI). గూగుల్ జెమిని వంటి ఏఐ మోడల్స్ పని చేయాలన్నా, మనం అడిగే ప్రశ్నలకు సెకన్లలో సమాధానం రావాలన్నా వెనుక భారీ కంప్యూటర్లు (డేటా సెంటర్లు) అవసరం.

సామాన్యులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?

రికార్డు స్థాయిలో డిమాండ్: అమెరికాలో గూగుల్ $15 బిలియన్ల అప్పు కావాలని అడిగితే పెట్టుబడిదారులు ఏకంగా $100 బిలియన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీనిని బట్టి గూగుల్ మీద మార్కెట్‌లో ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం అప్పు: ప్రస్తుతం ఆల్ఫాబెట్ చేస్తున్న మొత్తం దీర్ఘకాలిక అప్పు విలువ సుమారు $46.5 బిలియన్లకు చేరుకుంది. నేరుగా మనం ఈ బాండ్లు కొనకపోయినా మనం దాచుకునే ఇన్సూరెన్స్ డబ్బులు లేదా పెన్షన్ ఫండ్స్ సంస్థలు ఇలాంటి సురక్షితమైన బాండ్లలో పెట్టుబడి పెడతాయి. గూగుల్ వంటి లాభాల్లో ఉన్న కంపెనీ వందేళ్ల పాటు వడ్డీ కడుతుంది. కాబట్టి మన పెన్షన్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీలకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు