हिन्दी | Epaper

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

Vanipushpa
తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫస్ట్ మ్యాచ్ ఆరంభంలోనే డ్రామా నడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. షాహీన్ షా అఫ్రిది వేసిన రెండో బంతిని కివీస్ బ్యాటర్ విల్ యంగ్ ఎక్స్‌ట్రా కవర్‌లోకి నెట్టాడు. బౌండరీ వైపు వెళ్తున్న ఆ బంతిని ఆపే యత్నంలో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. ఆ బంతికి న్యూజిలాండ్ బ్యాటర్లు మూడు పరుగులు తీశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంలోనే తమ ప్లేయర్ గాయపడటంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బౌండరీ దగ్గర కాలి మడమ గాయమైనట్లు తెలుస్తోంది.

పాక్-భారత్ మధ్య హై ఓల్టేజీ

బంతిని మరో ఫీల్డర్‌కి అందించి బౌండరీ బయట కూర్చున్నాడు. ఫిజియో వచ్చి చూసినా లాభం లేకపోవడంతో గ్రౌండ్‌ని విడవాల్సి వచ్చింది. ఫఖర్ జమాన్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా కమ్రాన్ గులామ్ ఫీల్డింగ్‌కి వచ్చాడు. పాకిస్తాన్ ఓపెనర్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌కి ఇలా కావడంతో పాక్ ప్లేయర్లు కూడా టెన్షన్ అవుతున్నారు. ఫఖర్ జమాన్ కోలుకోకపోతే పాకిస్తాన్ జట్టుకు చాలా ఇబ్బందనే చెప్పొచ్చు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాక్-భారత్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్‌పై ఫఖర్ జమాన్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మ్యాచ్‌ని సైతం మలుపుతిప్పే బ్యాటింగ్ ఫకర్ జమాన్‌ది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించాలని పాకిస్తాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తలపడుతున్న పాకిస్తాన్

టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చేసింది. తొలి మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది పాకిస్తాన్. కరాచీ స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

ఇరాన్ ‘కిరీట రత్నం’ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బాంబుల వర్షం!

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

📢 For Advertisement Booking: 98481 12870