పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులను ముమ్మరం చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా రెండు దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ యుధ్ధంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఏ దేశానికి సపోర్ట చేయాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ఇరాన్ ప్రధానంగా సౌదీ అరేబియా డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియా, యూఎఈ వంటి ఇతర గల్ఫ్ దేశాలపై బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ రెచ్చిపోతంది. ఈ పరిణామాలు దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)ను రెండు ప్రధాన శక్తుల మధ్య సున్నితమైన పరిస్థితిలో నిలబెట్టాయి. ఇరాన్‌తో సంబంధాలు ఉన్నా, సౌదీ అరేబియాతో దీర్ఘకాల సంబంధాలు పాకిస్థాన్‌కు ఉన్నాయి. ఓ వైపు పాకిస్థాన్ ఇరాన్‌తో సుమారు 900‑కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. మరోవైపు లక్షలాది పాకిస్థానీలు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నందున ఆర్థికంగా రెండు దేశాల ప్రభావం దేశంపై ఉంది.
Read Also: North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

నిపుణులు చెబుతున్నది ఏమిటంటే..
ఇరాన్, సౌదీ అరేబియాతో తటస్థంగా ఉండటానికి Pakistan తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2025 సెప్టెంబర్‌లో పాకిస్థాన్- సౌదీ అరేబియా మధ్య ఒక ప్రముఖ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఎక్కడైనా ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. ప్రత్యేక రక్షణ బలాన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి లేనప్పటికీ, భవిష్యత్తులో ఒత్తిడి పెరగడం ఆశ్చర్యం కాదు. ఈ ఒప్పందంతో పాకిస్థాన్ ఇరాన్‌కు తన రక్షణ బాధ్యతను గుర్తు చేసింది. అలాగే ఇరాన్ కూడా సౌదీ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించకుండా ఉండటానికి సమ్మతించింది. అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా.. ఇరాన్‌తో పాకిస్థాన్‌కి సుదీర్ఘ సరిహద్దు సంబంధాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: