భారత సైన్యంలోని మహిళా అధికారి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ధైర్యం, అంకితభావానికి మాత్రమే కాకుండా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆమె పాత్ర తనని వెలుగులోకి తెచ్చింది. ఆపరేషన్ సింధూర్ భారత చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఆపరేషన్, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ మిషన్‌లో భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు కీలక సమాచారాన్ని అందించారు.
సైన్యంతో చాలా కాలంగా అనుబంధం
ఏంటంటే పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించామని, పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని ఇవాళ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య ఈ ఆపరేషన్ జరిగిందని ఆమె మీడియ సమావేశంలో పేర్కొన్నారు. అసలు సోఫియా ఖురేషి ఎవరు, ఆమెకు

ఎంత జీతం తెలుసా…
లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్‌లోని వడోదరకు చెందినవారు. ఆమె 1981లో జన్మించింది ఇంకా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆమె కుటుంబానికి సైన్యంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఎందుకంటే ఆమె తాత, తండ్రి కూడా సైన్యంలో పనిచేశారు. సోఫియా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో శిక్షణ పొందింది తరువాత 1999లో ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. తన సైనిక జీవితంలో ఈశాన్య భారతదేశంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్స్ అండ్ వరద సహాయ కార్యకలాపాలలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆమె జీతం ఎంతంటే..
ఇప్పుడు అందరికి తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి జీతం ఎంత ? లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి జీతం గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ భారత సైన్యంలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ జీతం ఆమె సర్వీస్ కాలం, పోస్టింగ్ ప్రదేశం ఇంకా ఇతర అలవెన్సులు వంటి చాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక లెఫ్టినెంట్ కల్నల్ ప్రతినెల జీతం రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల మధ్య ఉండొచ్చు అని సమాచారం.
ఇందులో బేసిక్ పే, మిలిటరీ సర్వీస్ పే (MSP), డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంకా ఇంటి రెంట్ అలవెన్స్ (HRA) వంటి అలవెన్సులు ఉంటాయి. వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ వంటి ప్రత్యేక కార్యకలాపాలలో పాల్గొనడానికి అదనపు అలవెన్సులు కూడా ఇవ్వవచ్చు. ఒక అధికారిని అధిక-ప్రమాదకర ప్రాంతాలలో నియమించినట్లయితే లేదా ఆపరేషనల్ అసైన్‌మెంట్‌లపై పంపినట్లయితే, వారి జీతం మరింత పెరగవచ్చు. ఈ జీతం ఇంకా అలవెన్సులు భారత సైన్యం నిర్మాణం అలాగే ప్రభుత్వ నియమాల ఆధారంగా నిర్ణయించి ఉంటాయి.
Read Also: Operation Sindoor On Pakistan: పాక్ సైనిక చర్యలతో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు