हिन्दी | Epaper

OpenAI Bengaluru Office: ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

Aanusha
OpenAI Bengaluru Office: ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

OpenAI Bengaluru Office: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ కంపెనీలు భారత్‌ను ముఖ్య కేంద్రంగా గుర్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న AI టెక్నాలజీ నేపథ్యంలో, భారత్‌లోని టెక్ ఎకోసిస్టమ్‌పై గ్లోబల్ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది చివరిలోగా బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారత్‌లో ఏఐ వినియోగం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల లభ్యత, ప్రభుత్వ మద్దతు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.

Read Also: Mukesh Ambani: AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

OpenAI to open new office in Bengaluru
OpenAI to open new office in Bengaluru

శక్తివంతమైన దేశం

భారతదేశం ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వీకరణలో ముందంజలో ఉందని ఆయన ప్రశంసించారు. దేశంలో ఉన్న స్వదేశీ సాంకేతిక ప్రతిభ, AI ద్వారా దేశం సాధించగల మార్పులపై ఉన్న ఆశావాదం, అలాగే ప్రభుత్వ మద్దతు అన్నీ కలిపి భారత్‌ను గ్లోబల్ AI భవిష్యత్తును రూపొందించే శక్తివంతమైన దేశంగా నిలబెడుతున్నాయని తెలిపారు. OpenAI for India కార్యక్రమం ద్వారా భారతదేశంతో కలిసి.. భారతదేశం కోసం, భారతదేశంలోనే AIని నిర్మించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, స్థానిక భాగస్వామ్యాలను అభివృద్ధి చేస్తున్నామని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870