జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అవినాబావ సంబంధాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా, పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సుల అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్… అమెరికా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి. లష్కరే తొయీబా (LeT) ఉపాధ్యక్షుడు సైఫుల్లాహ్ కాసౌరి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ర్యాలీలో అతడితో పాటు లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ (Hafiz Saeed) కుమారుడు తల్హా సయీద్ కూడా పాల్గొనడం గమనార్హం.

పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫుల్లాహ్ కాసౌరిని అనుమానితుడిగా చూడకూడదని, విచారణ పూర్తికాని వరకు అతడు అనుమానించకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను కూడా కాసౌరి ప్రాంతానికి చెందినవాడ్నే అని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు.
1971 ఓటమికి ప్రతీకారంగా విజయం
1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో తాము విజయం సాధించామని పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో కాసౌరీ, తల్హా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం మే 28న ఈ ర్యాలీని గుజ్రన్‌వాలాలో లష్కరే తొయిబా రాజకీయ విభాగం నిర్వహించింది.
అలాగే, ర్యాలీలో లష్కరే నేతలు మాట్లాడుతూ.. గతేడాది బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసినాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో తమ పాత్రను ఘనంగా చెప్పుకున్నారు.