हिन्दी | Epaper

USA: రియల్ ఐడీ లేకపోతే విమానంలో కి నో ఎంట్రీ

Anusha
USA: రియల్ ఐడీ లేకపోతే విమానంలో కి నో ఎంట్రీ

అమెరికాలో స్థిరపడి అక్కడే నివసిస్తున్న గ్రీన్ కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ముఖ్యంగా వీరు దేశీయ విమానాల్లో ప్రయాణించాలంటే కచ్చితంగా రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. పాస్‌పోర్టుతో పాటు రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ఐడీలను వెంట తీసుకు వెళ్లాలని వివరించింది. ఇవేవీ తీసుకు వెళ్లకుండానే వెళ్తే విమానాశ్రయ భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించదని వెల్లడించింది. 

పూర్తి వివరాలు 

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపిస్తూ అమెరికా ఫస్ట్ నినాదం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికాలో స్థిరపడ్డ ఇతర దేశాల ప్రజలు అంటే గ్రీన్ కార్డుదారులు దేశీయంగా విమానాల్లో ప్రయాణించాలంటే పాస్‌పోర్ట్ సహా వారి రియల్ ఐడీని కూడా చూపించాలని ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. మే 7వ తేదీ నుంచే దీన్ని అమలు చేస్తున్నామని కాబట్టి గ్రీన్ కార్డుదారులు అంతా విమానాల్లో ప్రయాణించేందుకు వెళ్లేటప్పుడు రియల్ ఐడీ కార్డులను కూడా వెంట తీసుకెళ్లాలని సూచించింది. రియల్ ఐడీలు అంటే సదరు వ్యక్తికి రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా అక్కడి ప్రభుత్వ ఐడీ కార్డులను విమానాశ్రయంలో చూపించాలి. ఇవి వారి దగ్గర లేకపోయినా, చూపించడంలో విఫలం అయినా వారు అదనపు స్క్రీనింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదంతా జరగడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంటుందని ఫలితంగా విమానాలు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.

 America: రియల్ ఐడీ లేకపోతే విమానంలో కి నో ఎంట్రీ : యూఎస్ఏ

గుర్తింపు కార్డు

కొన్నిసార్లు రియల్ ఐడీలు లేకపోతే ఎయిర్ పోర్టు సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్దకు కూడా ప్రవేశాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి గ్రీన్ కార్డుదారులు అందరూ టిఎస్ ఏ సైనిక ఐడీ లేదా శాశ్వత నివాసి కార్డ్ వంటి ఇతర ఆమోదయోగ్యమైన గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని తెలిపింది.

Read Also: Military Officer: భారత్ పై బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

📢 For Advertisement Booking: 98481 12870