हिन्दी | Epaper

ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

Vanipushpa
ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రి మార్కో రూబియోపై డోజ్ సలహాదారు ఎలాన్ మస్క్ విమర్శలు చేశారని, దీంతో ట్రంప్ సమక్షంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అయితే, అలాంటిదేమీ లేదంటూ ట్రంప్ ఈ వార్తలను కొట్టిపారేశారు. మస్క్, రూబియోల మధ్య గొడవలు లేవని, ఇద్దరూ చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ వివరించారు.

ట్రంప్ సమక్షంలోనే నేతల గొడవలు..అలాంటివి లేవని వివరణ

గొడవలకు కారణం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డోజ్ సలహాదారు మస్క్ లు ఇటీవల జరిగిన ట్రంప్ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులలో పనిచేయని వారిని తాను ఇంటికి పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు. మార్కో రూబియో మాత్రం ఎవరినీ తొలగించడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై రూబియో స్పందిస్తూ.. ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు ముందస్తుగా పదవీ విరమణ చేశారని తెలిపారు. ఆ తర్వాత మస్క్, రూబియోల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మీడియా ప్రచురించిన వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, రూబియో- మస్క్ ల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఆ నేతలిద్దరూ తమ తమ శాఖలలో చక్కగా పనిచేస్తున్నారని ట్రంప్ కితాబునిచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870