हिन्दी | Epaper

Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?

Vanipushpa
Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 1989లో దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. అంటే గత 37 ఏళ్లుగా నిరంతరాయంగా పాటిస్తున్న ఒక కీలక సంప్రదాయాన్ని ఆయన మొట్ట మొదటి సారిగా పక్కన పెట్టారు. ఫిబ్రవరి 8వ తేదీన ప్రతి ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు అయ్యారు. 1979 ఫిబ్రవరి 8వ తేదీన ఇరాన్ వాయుసేన అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూల్చి వేసేందుకు అప్పటి విప్లవ నేత రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ కమాండర్లు దేశ అత్యున్నత నేతను కలవడం ఆచారంగా వస్తోంది. చివరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా ఖమేనీ ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

Read Also: Child Safety: స్కూలు బ‌స్సులు ప‌సుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?
Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?

ట్రంప్ హెచ్చరికల ఎఫెక్టేనా?

ఖమేనీ గైర్హాజరు వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ట్రంప్ గురి పెట్టడం, ఒకవేళ దాడులు జరిగితే అది మొత్తం మధ్యప్రాచ్యానికి వ్యాపిస్తుందని ఇరాన్ హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచాయి. దీనికి తగ్గట్టుగానే అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ను అరేబియా సముద్రంలోకి పంపింది. అలాగే జోర్డాన్‌లోని కీలక స్థావరాలకు ఎఫ్-15 యుద్ధ విమానాలు, రీపర్ డ్రోన్లను భారీగా తరలించింది. 2025 జూన్‌లో జరిగిన 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఇరాన్ కేవలం తన అణు కార్యక్రమంపైనే చర్చిస్తానని చెబుతుండగా.. క్షిపణి వ్యవస్థను కూడా చర్చల్లోకి తేవాలని అమెరికా పట్టుబడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

📢 For Advertisement Booking: 98481 12870