हिन्दी | Epaper

Kerala Community: కేర‌ళ క‌మ్యూనిటీ ఈవెంట్‌కు పాక్‌ మాజీ క్రికెట‌ర్ల ఆహ్వానం పై నెటిజ‌న్ల ఆగ్రహం

Anusha
Kerala Community: కేర‌ళ క‌మ్యూనిటీ ఈవెంట్‌కు పాక్‌ మాజీ క్రికెట‌ర్ల ఆహ్వానం పై నెటిజ‌న్ల ఆగ్రహం

ఏప్రిల్ 22న జ‌మ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జ‌రిగిన పాశ‌విక ఉగ్ర‌దాడిలో ముష్క‌రులు అమాయ‌కులైన‌ 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్ ప్రతీకారంగా పాకిస్థాన్‌, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీఓకే)ల‌లో ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) పేరిట‌ క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. ఇది త‌ట్టుకోలేని పాక్ భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని డ్రోన్‌, మిస్సైల్స్ దాడుల‌కు పాల్ప‌డింది. ఈనేప‌థ్యంలో భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.అయితే, దుబాయిలో కేర‌ళ క‌మ్యూనిటీ నిర్వ‌హించిన ఓ ఈవెంట్‌కు పాకిస్థానీ మాజీ క్రికెట‌ర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమ‌ర్ గుల్‌(Shahid Afridi, Umar Gul)ను ఆహ్వానించ‌డం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, పాక్ యుద్ధం విష‌యాల‌ను మ‌రిచి ఆ దేశ క్రికెట‌ర్ల‌ను పిల‌వ‌డ‌మేంట‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆఫ్రిది చాలాసార్లు ఇండియాకు వ్య‌తిరేకంగా మాట్లాడిన విష‌యం గుర్తులేదా అని మండిప‌డుతున్నారు. 

విషపూరిత

ప‌హ‌ల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా ఆఫ్రిది భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశార‌ని, భార‌త్‌పై విజ‌యం సాధించామంటూ అక్క‌డి ప్ర‌జ‌లు చేసిన ర్యాలీలోనూ అత‌డు పాల్గొన్నాడ‌ని గుర్తు చేసి ఫైర్ అవుతున్నారు. అలాంటి వ్య‌క్తికి కేరళ క‌మ్యూనిటీ(Kerala Community) నుంచి ఘన స్వాగతం లభించడాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.”ఇది ఎంత సిగ్గుచేటు ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారతదేశంపై అతని విషపూరిత వైఖరి, తెలిసి కూడా దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళీయులు ఈ భారత వ్యతిరేక పాకిస్థానీని ‘బూమ్ బూమ్’ అంటూ  స్వాగతించారు” అని ఓ యూజ‌ర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈవెంట్ తాలూకు వీడియో పోస్ట్ చేశారు.

స్వాగ‌తం

గతంలో ఓ టాక్ షోలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ”మీరు కాశ్మీర్‌లో 8 లక్షల మంది సైన్యాన్ని మోహరించారు. అయినప్పటికీ అక్కడ అలాంటి సంఘటన జరిగింది. దీని అర్థం మీరు మీ ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మీరు, మీ ఆర్మీ అసమర్థులు” అని అన్నారు. ఆఫ్రిది(Shahid Afridi) మాట్లాడిన ఆ వీడియోను మ‌రో యూజ‌ర్ షేర్ చేస్తూ “కానీ, ఇప్పుడు అలాంటి వ్య‌క్తికి మ‌నోళ్లు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం ఇది చూడటానికి సిగ్గుగా ఉంది” అని రాసుకొచ్చారు. 

Read Also: Thane: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత ఇంజనీర్..పాక్ కు రహస్యాల చేరివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870