ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండో రోజు ఆట ఉత్కంఠ భరితంగా కొనసాగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ రోజు కీలక ఘట్టం – భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరోసారి జో రూట్‌ను ఔట్ చేయడం.బుమ్రా చేతిలో రూట్‌కు టెస్ట్ క్రికెట్‌లో 10వ సారి అవుట్ కావడం విశేషం.జో రూట్ తన ఈ చిన్న ఇన్నింగ్స్‌లో కూడా సచిన్ టెండూల్కర్ కీలక రికార్డును బ్రేక్ చేశాడు.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకే పరమితమైంది. అయితే జట్టు స్కోరు 500 పరుగులు దాటుతుందని అంతా భావించారు. శుభ్‌మన్ గిల్(147) వికెట్ తర్వాత బ్యాటర్లందరూ 41 పరుగులలోపు ఔట్ అయ్యారు. ఒకానొక దశలో స్కోరు 430/3గా ఉండగా మొత్తం జట్టు 471 పరుగుల వద్ద కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం ద్వారా గొప్ప ఆరంభం ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బెన్ డకెట్ (Ben Duckett) , ఓలి పోప్ మధ్య 122 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
సచిన్ టెండూల్కర్
బెన్ డకెట్(62) ఔట్ అయిన తర్వాత జో రూట్ క్రీజులోకి వచ్చాడు.ఓలి పోప్, జో రూట్ మధ్య 80 పరుగుల భాగస్వామ్యం ఉంది. రెండో రోజు ఆట ముగిసేలోపు 47వ ఓవర్ రెండో బంతికి పోప్ తన సెంచరీని పూర్తి చేశాడు. మరుసటి బంతికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ జో రూట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. జో రూట్ (Joe Root) 58 బంతుల్లో 28 పరుగులు చేశాడు. జో రూట్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ చివరిసారిగా 2011లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జో రూట్ గురించి చెప్పాలంటే అతను ఈ మ్యాచ్ లో 2 పరుగులు చేసిన వెంటనే సచిన్ (Sachin Tendulkar) ను వెనక్కి నెట్టాడు.

వాతావరణ నివేదిక
ఇప్పుడు జో రూట్ ఇంగ్లాండ్‌లో భారత్‌పై 1602 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.లీడ్స్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు భారత బౌలర్లు తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంది. వాతావరణ నివేదిక ప్రకారం, తేలికపాటి వర్షం, మేఘావృతమైన వాతావరణం (weather) ఉంటుందని భావిస్తున్నారు, అటువంటి పరిస్థితిలో బంతి స్వింగ్ అవుతుంది. భారత బౌలర్లు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆదివారం ఇలాంటి వాతావరణం కారణంగానే టీమిండియా వికెట్లు పడిపోయాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 209/3 కాగా వారు 262 పరుగులు వెనకబడి ఉన్నారు. ఓలి పోప్(100), హ్యారీ బ్రూక్(00) మూడో రోజు ఆటను ప్రారంభించనున్నారు.
Read Also: TRA: ప్రారంభమైన తెలంగాణ షూటింగ్ టోర్నీ