ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి (Israel-Iran) తెరపడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల విషయంలో టెహ్రాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధాలు (nuclear weapon) తయారు చేయాలనుకుంటే అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ఒకవేళ భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయాలని అనుకుంటే.. వారు (ఇరాన్) అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వాన్స్
అణ్వాయుధాల విషయంలో టెహ్రాన్‌కు అమెరికా హెచ్చరికలు
JD Vance | భవిష్యత్తులో అలా చేయాలనుకుంటే.. కాల్పుల విరమణ వేళ ఇరాన్‌కు జేడీ వాన్స్ కీలక హెచ్చరిక JD Vance | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి (Israel-Iran) తెరపడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల విషయంలో టెహ్రాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక హెచ్చరికలు జారీ చేశారు.

JD Vance | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి (Israel-Iran) తెరపడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల విషయంలో టెహ్రాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధాలు (nuclear weapon) తయారు చేయాలనుకుంటే అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ఒకవేళ భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయాలని అనుకుంటే.. వారు (ఇరాన్) అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వాన్స్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. దీన్ని ఎవరూ అతిక్రమించరాదు అని ఆయన కోరారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
అమల్లోకి కాల్పుల విమరణ : ఇరాన్
ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం (ceasefire) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్‌పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్‌తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
Read Also: Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..3 వేలు తగ్గిన బంగారం ధర.. !