हिन्दी | Epaper

Jaishankar: ఉగ్రదాడిని బ్రిటన్ ఖండించడంపై జైశంకర్ ధన్యవాదాలు

Vanipushpa
Jaishankar: ఉగ్రదాడిని బ్రిటన్ ఖండించడంపై జైశంకర్ ధన్యవాదాలు

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని భారత్(Bharath) ఎన్నటికీ సహించబోదని, దుష్టులను, బాధితులను ఒకే గాటన కట్టలేమని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా జైశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించినందుకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

ఉగ్రదాడిని బ్రిటన్ ఖండించడంపై జైశంకర్ ధన్యవాదాలు
ఉగ్రదాడిని బ్రిటన్ ఖండించడంపై జైశంకర్ ధన్యవాదాలు

భారత్ ‘జీరో టాలరెన్స్’
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఉగ్రవాదాన్ని మేం ఏమాత్రం ఉపేక్షించం. ఈ విషయంలో భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోంది. చెడు చేసేవారిని, ఆ చెడు వల్ల నష్టపోయిన బాధితులను ఒకేలా చూస్తామంటే మేం దాన్ని ఎప్పటికీ అంగీకరించం. ఈ విషయాన్ని మా భాగస్వామ్య దేశాలన్నీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ఈ భేటీలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Read Also: Virat Kohli Fan: ఇదేమి అభిమానం భయ్యా.!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870