Iran Warns US Israel : నెతన్యాహును నరకానికి పంపుతాం అంటూ ఇరాన్​ తీవ్ర హెచ్చరికలు

Follow Us: Google News Daily Hunt
Iran Warns US Israel
Iran Warns US Israel
FONT SIZE
GET APP

Iran Warns US Israel : అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మోహ్‌సేన్ రెజాయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌పై ఆర్థిక, నావికా దిగ్బంధనాలు కొనసాగిస్తే అమెరికా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు చేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి మరీ తీవ్రమైతే ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహును నరకానికి పంపుతామని అల్టిమేటం ఇచ్చారు. జియోనిస్ట్ పాలన అంతానికి రోజులు దగ్గరపడ్డాయని, ఆక్రమిత లెబనాన్ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీ టెహ్రాన్‌లో ఇరాన్ (Iran) అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో భేటీ అయ్యి దౌత్య సంప్రదింపులు జరిపారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, దిగ్బంధనాన్ని ఛేదించి కాల్పుల విరమణ సమయంలో సుమారు 70 నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసినట్లు రెజాయ్ వెల్లడించారు.

Read Also: Bill Gates: మానవాళికి ఏఐతో భారీ ముప్పు: బిల్ గేట్స్

Iran Warns US Israel
Iran Warns US Israel

Iran Warns US Israel : ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’తో అమెరికా ఆంక్షల వేటు

ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోకెమికల్ వ్యాపారాలను దెబ్బతీసేందుకు అమెరికా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరిట దాదాపు 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెతన్యాహు ప్రశంసించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడం ద్వారా దాన్ని పూర్తిగా కుప్పకూల్చడమే ఈ ఆంక్షల ప్రధాన లక్ష్యమని వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్‌ల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్‌లో భారీ ద్రవ్యోల్బణం నెలకొందని, వారి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. సైనిక చర్యలతో పాటు ఆర్థిక పరమైన ఆంక్షలు ఇరాన్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు