ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా ఉంటుంది: నెతన్యాహు
ఇజ్రాయెల్: హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. ఆ దేశ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆ దేశంలోని నిరంకుశ పాలనను త్వరలోనే అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామన్నారు. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. ”ప్రతి రోజూ మీ పాలకులు మిమ్మల్ని అణచివేస్తూ గాజా, లెబనాన్‌ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను…