हिन्दी | Epaper

Iran: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు: ఇరాజ్​ ఎలాహి

Vanipushpa
Iran: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు: ఇరాజ్​ ఎలాహి

ఇరాన్​-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వేళ భారత్​లోని ఇరాన్​ రాయబారి డాక్టర్ ఇరాజ్​ ఎలాహి అమెరికా( Iraj Elahi America)ను సుతిమెత్తగా హెచ్చరించారు. ఖతార్​, ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు చేసిందని చెప్పారు. ఇలా ప్రపంచంలోని ఏ దేశమూ యూఎస్​ సైనిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం చేయలేదని, కానీ తాము చేశామని పేర్కొన్నారు. అమెరికా(America) ఇంకోసారి ఇరాన్​పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, దానిపై ప్రతిదాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఇరాన్ రాయబారి ఎలాహి, ఇరాన్​-ఇజ్రాయెల్​ ఘర్షణల్లో అమెరికా ప్రవేశం తాము ముందు ఊహించిందేనని అన్నారు. దానికి అనుగుణంగానే ఇరాన్ సంసిద్ధమైందని పేర్కొన్నారు.

Iran: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు :ఇరాజ్​ ఎలాహి
Iran: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు :ఇరాజ్​ ఎలాహి

ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి

అమెరికా శనివారం నాడు ఇరాన్​లోని మూడు ప్రధానమైన అణుస్థావరాలపై బంకర్​-బస్టర్ బాంబులతో దాడి చేసింది. దీనితో ఖతార్​, ఇరాక్​లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే చాలా క్షిపణులను అమెరికన్ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత, ఇజ్రాయెల్​-ఇరాన్​లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని, దీనితో 12 రోజుల యుద్ధం నిలిచిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిని అటు ఇజ్రాయెల్​, ఇటు ఇరాన్​ కూడా ధ్రువీకరించాయి.

నెతన్యాహు మానవీయ చట్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు
ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును నమ్మలేమని ఎలాహి అన్నారు. అందుకే ఇజ్రాయెల్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడితే, దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఇరాన్ సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.”బెంజిమన్ నెతన్యాహు నమ్మదగినవాడు కాదు. అతను ఇరాన్​పై సైనిక దాడిని ప్రారంభించాడు. దేశంలోని నివాస ప్రాంతాలను, అంబులెన్స్​లను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించాడు.

అణ్వాయుధాలు తయారు చేస్తోందంటూ
ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇది మధ్యప్రాచ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుందని ఆరోపిస్తూ, జూన్​ 13న ఇజ్రాయెల్​ దాడులు ప్రారంభించింది. ఈ దాడిని పలు దేశాలు ఖండించినప్పటకీ తన చర్యలను ఇజ్రాయెల్ సమర్థించుకుంది.

ఐరన్ డోమ్ విఫలమైంది!
ఐరోన్ డోమ్ సహా ఇజ్రాయెల్​ వద్దనున్న ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలేవీ ఇరాన్​ క్షిపణులను అడ్డుకోలేకపోయాయని ఎలాహి పేర్కొన్నారు. అందుకే తమ క్షిపణులు ఇజ్రాయెల్​ భూభాగంలోని లక్ష్యాలను ఛేదించగలిగాయని ఆయన చెప్పారు. ఇరాన్ యుద్ధాన్ని మరింత పొడిగించాలని కోరుకోవడం లేదు. కానీ బాహ్య శక్తులు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఇలాహీ స్పష్టం చేశారు. “అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల మద్దతు లేకుండా ఇజ్రాయెల్ స్వయంగా ఏమీ చేయలేదు. ఇరాన్​లోని ప్రస్తుత పాలకులను తొలగించాలనే అమెరికా దీర్ఘకాల ఆకాంక్ష ఇక ‘ఒక కల’గానే మిగిలిపోతుంది” ​అని ఎలాహి పేర్కొన్నారు.

Read Also: Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..3 వేలు తగ్గిన బంగారం ధర.. !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

📢 For Advertisement Booking: 98481 12870