Oman Drone Attack: పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ కార్మికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒమన్‌లోని పారిశ్రామిక నగరమైన సోహర్‌లో జరిగిన భీకర డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 10 మంది భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ విషాదకర ఘటనను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది.అయితే గాయపడిన వారు సైతం భారతీయులేనని స్పష్టం చేసింది.
Read Also: CEO Julie: AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!
అసలేం జరిగిందంటే..?
ఒమన్‌లోని మస్కట్ సమీపంలో ఉన్న సోహర్ నగరంలోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతంలో ఒక డ్రోన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 11 మంది గాయపడినట్లు అధికారులు గుర్తించారు. అయితే చనిపోయిన ఇద్దరు కూడా భారతీయులేనని తెలుసుకున్న అధికారులు.. వారి మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా గాయపడిన 11 మందిలో 10 మంది భారతీయులేనని స్పష్టం చేశారు. అయితే వీరందరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపగా.. ఐదుగురు ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. మిగిలిన ఐదుగురు మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉందని అదనపు కార్యదర్శి అసీమ్ మహాజన్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: