हिन्दी | Epaper

Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

Anusha
Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు భారత్ దీటుగా స్పందిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) తర్వాత పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో వరుసగా దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంతో పాటు ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌ను ధ్వంసం చేశాయి.పాక్ దాడులపై భారత సైన్యం ఇవాళ ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది.కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాక్ సరిహద్దు ప్రాంతాలతో పాటు భారత వైమానిక, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు. శ్రీనగర్, అవంతిపొర, పఠాన్‌కోట్ వైమానిక స్థావరాలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని ఆమె స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు అనేకసార్లు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని 24 చోట్ల ఫైటర్ జెట్‌లతో దాడికి ప్రయత్నించాయని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా పాక్‌పై బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉపయోగించినట్లు తెలిపారు.

బాలిస్టిక్

పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ రాజకీయాలకు అతీతంగా కేంద్రం, సైన్యం చర్యలకు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నేషన్ ఫస్ట్ నినాదంతో సైన్యానికి అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కీలక కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని అన్నారు. పాక్ మాటిమాటికి మజాక్ చేస్తుందని,పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదన్నారు. ఈ భూమ్మీదకు వచ్చాక.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలన్నారు.అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి.’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యనించారు. యుద్ధం జరిగితే భారతదేశంలోని ముస్లింలు దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటారని ఇటీవల ఓవైసీ కామెంట్స్ చేశారు. మా దేశాన్ని రక్షించడానికి ఏదైనా చేస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని ఉగ్రవాదం ఏ దేశానికి మంచిది కాదని హితవు పలికారు.

Read Also :Operation Sindoor : మోదీ జీ.. మ్యాప్ లో పాకిస్థాన్ ను లేకుండా చేయండి – మల్లారెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870