हिन्दी | Epaper

NASA : రోదసి వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎలా? పరిష్కారం సూచిస్తే రూ.25.82 కోట్లు బహుమతి: నాసా

Anusha
NASA : రోదసి వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎలా? పరిష్కారం సూచిస్తే రూ.25.82 కోట్లు బహుమతి: నాసా

చంద్రునిపై పరిశోధనలు సాగించేందుకు, మానవ నివాసాలను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు కొనసాగిస్తుండగా, మరో కీలక సమస్యపై నాసా దృష్టి సారించింది.దాదాపు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు.లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు.రోదసిలో మనుషుల వ్యర్థాలతోపాటు ఫుడ్‌ ప్యాకేజింగ్‌, బట్టలు, పాడైన పరికరాలూ ఉన్నాయని పేర్కొంది. ఈ ఛాలెంజ్‌లో రెండు ట్రాక్‌లు ఉంటాయి. బృందాలుగా, వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు. ప్రవేశ రుసుము లేదు. ట్రాక్‌-1లో కఠినమైన చంద్రుని వాతావరణంలో పనిచేసే ఫుల్‌ రిసోర్స్‌ రికవరీ సిస్టమ్‌ డిజిటల్‌ మోడల్‌ను డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. ట్రాక్‌-2లో ఇలాంటి సిస్టమ్‌లో వినియోగించదగిన ముఖ్యమైన కాంపొనెంట్‌ లేదా సబ్‌సిస్టమ్‌ వర్కింగ్‌ ప్రోటోటైప్‌ను నిర్మించడం, ప్రదర్శించడంపై దృష్టి పెట్టాలి.

25 కోట్లు

చంద్రుడిపైనే ఉండిపోయిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న నాసా లూనా రీసైకిల్‌ పేరిట ఒక ఛాలెంజ్‌ను ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి దాదాపు రూ.25 కోట్లు అందజేస్తామని తెలిపింది.చంద్రుడిపైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్‌ ద్వారా మళ్లీ వినియోగిస్తుంటారు. అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా, తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ నాసా ఒక ఛాలెంజ్ ప్రకటించింది. భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను కనుగొనాలని చూస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అమెరికాతో పాటు జాబిలిపై పరిశోధనలు సాగిస్తున్న భారత్ వంటి దేశాలకూ ఉపయుక్తంగా ఉంటుంది.

 NASA: రోదసి వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎలా? పరిష్కారం సూచిస్తే రూ.25.82 కోట్లు బహుమతి: నాసా

భూమికి తీసుకురావడం

భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలు ఏర్పాటు లక్ష్యంగా నాసా ఆర్టెమిస్​ మిషన్​పై పనిచేస్తోంది. దానికి ముందు చంద్రుడిపై ఉన్న మాన వ్యర్థాలను నిర్వహణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కువ సమయం పట్టే అంతరిక్ష మిషన్​లలో అన్ని వనరులు టైట్​గా నిర్వహించడం, తిరిగి ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఆ వ్యర్థాలను తిరిగి భూమికి తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు నాసా ఇన్​-సిటు ప్రాసెసింగ్​ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ ఛాలెంజ్​ ఇచ్చింది.

Read Also: Bill Gates:రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుంది: బిల్ గేట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870