हिन्दी | Epaper

Operation Sindhur: ఆపరేషన్ సిందూర్ పేరు ఎలా వచ్చింది?

Anusha
Operation Sindhur: ఆపరేషన్ సిందూర్ పేరు ఎలా వచ్చింది?

ఆపరేషన్ సిందూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.బుధవారం ( మే 7, 2025 ) అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది.ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిపై ప్రతీకారంగా మురిడ్కేలో భారత ఆర్మీ దాడులు చేసింది.ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.

సమాచారం

ఇక భారత సైన్యం దాడులు చేసినట్టు పాకిస్థాన్‌ నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌ పూర్‌ ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్టు పాక్ వెల్లడించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.మరోవైపు శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్‌, ధర్మశాల, లేహ్‌ ఎయిర్‌పోర్టులను భారత్‌ మూసివేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలానే మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది రక్షణ శాఖ.

 Operation  Sindhur: ఆపరేషన్ సిందూర్ పేరు ఎలా వచ్చింది?

కుంకుమ

ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన సంకేతం ఉందని భావిస్తున్నారు. సంప్రదాయంగా, సిందూరం (కుంకుమ) వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే, ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన దాడి ఘటనలకు ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఆ దాడిలో ఉగ్రవాదులు బాధితులను వారి పేర్లు, మతం అడిగి తెలుసుకున్న తర్వాతే హత్య చేశారని కథనాలున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు నివాళులర్పించడంతో పాటు, న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని, ఆ ఘటనను గుర్తుచేస్తూ భారతదేశం ఈ చర్య చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also :India Pakistan War: ఇండియాకు మద్ధతు తెలిపిన ఇజ్రాయెల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!

📢 For Advertisement Booking: 98481 12870