हिन्दी | Epaper

Augustin Escobar: అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

Vanipushpa
Augustin Escobar: అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురూ మృతి చెందారు.

అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

సహాయక చర్యలు ప్రారంభం
మృతుల్లో ఎస్కోబార్,
ఆయన భార్య, ముగ్గురు పిల్లలతోపాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని ఒక భాగం విరిగిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది.

READ ALSO: Tuberculosis (TB) : ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే – పరిశోధకులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870