हिन्दी | Epaper

War: ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

Vanipushpa
War: ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు యుద్ధ హెచ్చరికల వరకు దారితీసింది. ఇరాన్‌(Iran)ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిరోధించే కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ వెంటనే ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరించి చర్చలకు రాకపోతే.. ఆ దేశంపై భీకర స్థాయిలో విరుచుకుపడతామని, అది ఇరాన్ వినాశనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాలు లేని ప్రపంచం అందరికీ మేలు చేస్తుందన్నారు.

Read Also: Budget 2026: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం: రాష్ట్రపతి ముర్ము

War: ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు
War: ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గతంలో కంటే దారుణమైన దాడులు

సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇప్పటికే ఇరాన్ దిశగా బయలుదేరాయని వెల్లడించారు. ఆ నౌకలు ఎంతో వేగంతో, స్పష్టమైన లక్ష్యంతో కదులుతున్నాయని చెప్పారు. ఇరాన్ ఆలోచించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉందని, త్వరగా ఒప్పందానికి అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే దారుణమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇరాన్, తనను తాను కాపాడుకోవడానికి పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడింది. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే.. పొరుగు దేశాల సహకారం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు కొన్ని కీలక దేశాల నుండి భరోసా లభించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. ఒకవేళ అమెరికా తమను బలవంతంగా యుద్ధం వైపు నెడితే, తాము కూడా ఊరుకోమని, గతంలో ఎన్నడూ చేయని విధంగా అమెరికాపై ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870