हिन्दी | Epaper

Latest News: Donald Trump: ట్రంప్ వార్నింగ్ తో దిగొచ్చిన హమాస్

Anusha
Latest News: Donald Trump: ట్రంప్ వార్నింగ్ తో దిగొచ్చిన హమాస్

సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్-హమాస్ లమధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ఓ ప్రణాళికను సూచించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన డిమాండ్లను అంగీకరించేందుకు వారికి నాలుగురోజులు గడువు ఇచ్చారు. ఈ డిమాండ్లను ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు (Netanyahu) అంగీకరించాడు. అయితే హమాస్ మాత్రం తటపటాయిస్తూ వచ్చారు.

PM Modi: గాజా విషయం లో ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

దీంతో ట్రంప్ హమాస్ (Hamas)  పై తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇజ్రాయెల్ తో కలిసి తాము హమాస్ అంతానికి కృషి చేస్తామని బెదిరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో హమాస్ పేర్కొంది.

బంధీల విడుదలకు అంగీకారం

ట్రంప్ ప్రణాళిక ప్రకారం తమ చెరలోని ఇజ్రాయెల్ (Israel) బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాల్లోని విషయాలపై చర్చలు జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ చర్చలు వెంటనే జరగాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

Donald Trump
Donald Trump

ఇక, గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థ (Palestinian Authority) కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా యుద్ధం ముగించి, శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వాములతోపాటు ట్రంప్ చేస్తున్నప్రయత్నాలకు హమాస్ కృతజ్ఞలు తెలిపింది.

ఇజ్రాయెల్ కు ట్రంప్ కీలక సూచనలు

బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కు ట్రంప్ కీలక సూచనలు జారీ చేశారు. గాజాపై బాంబు దాడులను వెంటనేనిలిపివేయాలంటూ ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టారు.’హమాస్ ప్రకటన ప్రకారం శాశ్వత శాంతికి వారు సిద్ధంగా ఉన్నట్లు నమ్ముతున్నా..

ఇజ్రాయెల్ వెంటనే గాజా (Gaza)పై బాంబులు దాడులను ఆపాలి. దీంతో మనం బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేసుకోగలం, ప్రస్తుతం దానిపై దాడులు చేయడం చాలా ప్రమాదకరం అని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు.

హమాస్ అంగీకారాన్ని స్వాగతించిన నెతన్యాహు

హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870