हिन्दी | Epaper

Operation Sindhur: భారత సైనిక చర్యపై చైనా కీలక వ్యాఖ్యలు

Anusha
Operation Sindhur: భారత సైనిక చర్యపై చైనా కీలక వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం బుధవారం “ఆపరేషన్ సిందూర్”ను ప్రారంభించింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకే)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై దాడి చేసింది. ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల టార్గెట్స్‌పై బాంబుల వర్షం కురిపించింది,పాకిస్తాన్‌లో 4 పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ చేసింది.ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో అర్థరాత్రి ఒంటిగంట తర్వాత మెరుపు దాడులు చేసింది పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.పాకిస్తాన్ తో పాటుగా పీఓకే లోని ఉగ్రవాద శిబిరాల పైన అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ భారత సైన్యం, క్షిపణులు ప్రయోగించింది. ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం దాడులను దేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్‌ తర్వాత పాక్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే.

సమాచారం

ఇక భారత సైన్యం దాడులు చేసినట్టు పాకిస్థాన్‌ నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌ పూర్‌ ప్రాంతాలపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడినట్టు పాక్ వెల్లడించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.మరోవైపు శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్‌, ధర్మశాల, లేహ్‌ ఎయిర్‌పోర్టులను భారత్‌ మూసివేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలానే మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది రక్షణ శాఖ.

 Operation  Sindhur: భారత సైనిక చర్యపై చైనా కీలక వ్యాఖ్యలు

ప్రాధాన్యత

తాజా పరిణామాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది అణ్వాయుధాలు కలిగిన పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది.ఈ రోజు ఉదయం పాకిస్తాన్ పై భారతదేశం సైనిక చర్యపై బీజింగ్ విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతుందుతున్నామని పేర్కొంది. ఇరు దేశాలు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.భారతదేశం – పాకిస్తాన్ పొరుగు దేశాలు, వాటిని వేరు చేయలేము, చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also : Stock Market: పాక్ పై భారత్ దాడి.. ఊపందుకున్న స్టాక్ మార్కెట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

మార్చి 14నే ‘పై డే’ ఎందుకు? ఐన్‌స్టీన్ బర్త్‌డేకి, 3.14కి ఉన్న లింక్ ఏంటి?

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

📢 For Advertisement Booking: 98481 12870