हिन्दी | Epaper

China: పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌ ఎందుకంటే?

Anusha
China: పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌ ఎందుకంటే?

భారత్, పాకిస్థాన్ మధ్య మే 7న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య సాగిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.అయితే, ఉద్రిక్తతలను తగ్గించేలా భారత్, పాక్‌లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు మే 10న ప్రకటించాయి. కానీ, ఆ రోజున నిజంగా ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు ఇలా యుద్ధానికి సిద్ధమవ్వడంతో అగ్రరాజ్యాలు అమెరికా, చైనా కూడా భారత్‌, పాక్‌ శాంతించాలని, చర్చలు జరుపుకోవాలని సూచించాయి. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం Truth Socialలో ‘అమెరికా మధ్యవర్తిత్వంతో 48 గంటల చర్చల తర్వాత, భారత్-పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు ‘తెలివిగా వ్యవహరించాయి’ అని పేర్కొన్నారు.ఆ వెంటనే భారత్‌, పాక్‌ ప్రభుత్వాలు కూడా కాల్పుల విమరణకు ఒప్పుకుంటున్నట్లు అంగీకరించాయి. తానే ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు కారణం అంటూ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. కానీ, ఈ విషయంలో చైనా(China) అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో భారత్‌, పాక్‌, అమెరికా హాట్‌లైన్లు బిజీగా ఉన్నాయి.

 China: పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌ ఎందుకంటే?
పాకిస్థాన్‌పై చైనా సీరియస్‌ ఎందుకంటే?

మధ్యవర్తిత్వం

కానీ, చైనాను ఆ చర్చల్లో భాగస్వామిని చేయలేదని సమాచారం. ఇదే విషయంలో పాకిస్థాన్‌పై చైనా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు బిగ్‌ బ్రదర్‌లాగా ఉండే తమను కాదని, మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించడంపై చైనా ఆగ్రహంగా ఉంది. కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత చైనా, పాకిస్థాన్‌తో చర్చలు జరిపింది. ఆ తర్వాత మళ్లీ భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పులకు పాల్పడింది. ఆ తర్వాత కాల్పులు ఆపేసింది. కాగా, భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణకు అమెరికాతో పాటు చైనా కూడా క్రెడిట్‌ తీసుకోవాలని ఆశపడుతోంది. అందుకే తమకు తగిన ప్రాధాన్యత లేకుండా చేసిన పాకిస్థాన్‌పై చైనా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Read Also : Pak journalist: తమ సైన్యం తప్పుడు ప్రచారం చేసిందని అంగీకరించిన పాక్ జర్నలిస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870