ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా, విస్తరిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ సాంకేతికత వల్ల మానవ జీవితంలో సౌలభ్యంతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) ఏఐ గురించి కీలకమైన అభిప్రాయాలను పంచుకున్నారు.ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కంటే దాన్ని దుర్వినియోగం చేయడమే అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
ప్రభావం రోజు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే సవాళ్లపై డెమిస్ హస్సాబిస్ తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఏఐ(AI) మనుషుల ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయం కంటే, ఈ శక్తివంతమైన సాంకేతికత దురుద్దేశాలున్న వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఒకవేళ అలా జరిగితే ఊహించని వినాశకర పరిస్థితులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి ఏఐ యాక్సెస్‌ను పరిమితం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ప్రస్తుత యుగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నది.సాంకేతిక రంగంలో వేగవంతమైన పురోగతితో పాటు, అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది.ఏఐను సరైన పద్ధతిలో, నియంత్రితంగా ఉపయోగిస్తే అద్భుతమైన పనులను సులభంగా, సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. అనేక రకాల పనులను ఆటోమేట్(Automate) చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడం, ఖర్చులను తగ్గించడం సాధ్యమవుతుందని, దీనివల్ల మానవ శ్రమ మరింత ప్రయోజనకరమైన మార్గాల్లో వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త ఉద్యోగావకాశాలు
ఏఐ ప్రభావం వల్ల ముఖ్యంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డెమిస్(Demis)అంగీకరించారు.సాధారణంగా చేసే చిన్న చిన్న పనులను ఏఐ టూల్స్ నిర్వహించడం వల్ల మానవులు మరింత కీలకమైన, సృజనాత్మకమైన పనులపై తమ దృష్టిని కేంద్రీకరించడానికి వీలు కలుగుతుందని ఆయన వివరించారు. దీనివల్ల మరింత నైపుణ్యంతో కూడిన కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని హస్సాబిస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ఏఐ శక్తి, దాని వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి అంతర్జాతీయ సహకారం(International cooperation) అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కిచెప్పారు.
Read Also: Banks: బ్యాంకింగ్ రంగంలో భారీగా లేఆప్స్