हिन्दी | Epaper

ICC: బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించిన ఐసీసీ

Anusha
ICC: బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ నిబంధనల్లో మరో కీలక మార్పు చేసింది. బన్నీ హాప్ క్యాచ్‌ల (Bunny Hop Catch) పై నిషేధం విధించింది. ఈ మార్పుతో బౌండరీ లైన్‌పై అందుకునే క్యాచ్‌లపై మరింత స్పష్టతను ఇచ్చింది. ఇక బౌండరీ‌పై క్యాచ్‌లు అందుకునే ఫీల్డర్లు బయట ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. రెండోసారి తాకితే సిక్సర్‌గా పరగణిస్తారు.గతంలో బౌండరీ బయట గాల్లో ఉంటూ బంతిని ఒకటి కంటే ఎక్కువ సార్లు తాకి అందుకున్న ఔటిచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ రూల్‌ను సవరించారు. బౌండరీ బయట గాల్లో ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. మరోసారి తాకితే సిక్సర్‌గా ఇస్తారు. ఈ రూల్ రిలే క్యాచ్‌లకు కూడా వర్తిస్తుంది. అంటే ఓ ఫీల్డర్ బౌండరీ బయట బంతిని గాల్లో నుంచి లోపల ఉన్న ఫీల్డర్‌కు అందజేసినా అతను పూర్తిగా గ్రౌండ్‌లోనే ఉండాలి.లేకుంటే ఇది కూడా బౌండరీ అవుతుంది.

రూల్స్ ప్రకారం

ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో మైకేల్ నెసర్ (Michael Neser) అందుకున్న ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ బయట మైకేల్ నెసర్ రెండు సార్లు బంతిని తాకి క్యాచ్‌ను పూర్తి చేశాడు. పాత రూల్స్ ప్రకారం అది ఔట్ అయినా ఇక నుంచి అలాంటి క్యాచ్‌లు బౌండరీగా మారుతాయి. మైకేల్ నెసర్ అందుకున్న ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ICC: బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించిన ఐసీసీ
ICC

అధికారికంగా

ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. దాంతో ఈ రూల్‌ను ఐసీసీ సవరించింది. ఈ నయా రూల్ మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌ (Marylebone Cricket Club) రూల్‌ బుక్‌లో అక్టోబర్ 2026‌లో అధికారికంగా చేర్చనున్నారు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా జూన్ 17 నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ రూల్‌ను అమలు చేయనున్నారు.

Read Also: Iran: అమెరికాతో అణు ఒప్పందం మాకు విశ్వాసం లేదన్న ఇరాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

📢 For Advertisement Booking: 98481 12870