I have immense respect for Bhatti Vikramarka.

KTR: భట్టి విక్రమార్క పై నాకు అపారమైన గౌరవం ఉంది: కేటీఆర్‌

KTR: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స‌న‌స‌భ‌లో అధికార ప‌క్షంపై నిప్పులు చెరిగారు. కేటీఆర్‌ను ఉద్దేశించిన డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు మిగ‌తా స‌భ్యులు మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమ‌లు చేస్తామ‌న్న సంక్షేమ ప‌థ‌కాల‌పై నిల‌దీసే హ‌క్కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ఎస్ పార్టీకి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మేం స‌భ‌ను ప్రోవోక్ చేయాల‌నుకుంటే చేయొచ్చు.. 30 శాతం క‌మీష‌న్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. 20 శాతం క‌మీష‌న్ అని స‌చివాల‌యంలో ధ‌ర్నాలు చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

Advertisements
భట్టి విక్రమార్క పై నాకు అపారమైన

భ‌ట్టి గారంటే గౌర‌వం ఉంది. పెద్ద‌న్న‌లాగా గౌర‌విస్తాం

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్పందిస్తూ.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోని మాట్లాడాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు డిమాండ్ చేశారు. అనంత‌రం కేటీఆర్‌కు మాట్లాడేందుకు స్పీక‌ర్ అవ‌కాశం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009 నుంచి క‌లిసి ప‌నిచేస్తున్నాం. ఆయ‌న డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న‌ప్పుడు నేను తొలిసారి ఎమ్మెల్యేగా వ‌చ్చాను. ఆయ‌న‌తో మాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. గ‌త 16 ఏండ్ల నుంచి ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. భ‌ట్టి గారంటే గౌర‌వం ఉంది. పెద్ద‌న్న‌లాగా గౌర‌విస్తాం. ఆది శ్రీనివాస్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా?

ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. 30 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. దాని మీద చ‌ర్య తీసుకోండి అని రెవెన్యూ మినిస్ట‌ర్‌ను కోరాను. 20 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని కాంట్రాక్ట‌ర్లు స‌చివాల‌యంలో ధ‌ర్నా చేశారు. దాని మీద చ‌ర్య తీసుకోమ‌ని అడిగాను. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Related Posts
Ayodhya : అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ
4 km long protective wall around Ayodhya Ram temple

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ Read more

టోల్ ప్లాజాలపై కేంద్రం కొత్త నిర్ణయం
tollplaza

ఏదయినా పండుగల సీజన్స్ లో ఊర్లకు వెళ్ళాలి అంటేనే టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్దీ వేచివుండాలి. ఇప్పుడు ఆ బాధలేదు. ఎందుకంటె జాతీయ రహదారులపై నిర్మించిన Read more

Ponnam Prabhakar: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు
Ponnam Prabhakar: కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, Read more

Terror Attack : ఉగ్రదాడిపై స్థానికులు ఏమంటున్నారంటే !
Terrorist Attack: ఉగ్రదాడిలో అసలు సూత్రధారి ఆర్మీ చీఫ్?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ బైసరీన్ వ్యాలీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. తమ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఊహించలేదని వారు అంటున్నారు. మధ్యాహ్నం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×