4 km long protective wall around Ayodhya Ram temple

Ayodhya : అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ

Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించాలని నిర్ణయించారు. ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్ర సోమవారం ఈ విషయం వెల్లడించారు. గోడను ఇంజనీర్స్‌ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్‌ వంటి విషయాలను నిర్ణయించామని, మట్టి పరీక్షలు నిర్వహించాక పని ప్రారంభిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం మూడోరోజు ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు.

Advertisements
image

కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు

ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్నివిధాలా పూర్తి కాబోతోందని మిశ్ర తెలిపారు. రామాలయ సముదాయంలోనే 10 ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో పదెకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపుర్‌ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని వెల్లడించారు.

ఆదివారం రాత్రి బెదిరింపు ఈ-మెయిల్‌

కాగా, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ అధికారిక మెయిల్‌ ఐడీకి ఆదివారం రాత్రి బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది. భద్రతను మరింత పెంచారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయంలోని గర్భగుడి ప్రధాన శిఖరంపై భారీ కలశాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. ‘కలశ పూజా విధి’ నిర్వహించారు. ఆలయ సముదాయంలో నిర్మిస్తున్న 6 దేవాలయాల పైభాగంలో కూడా కలశాలను మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఆలయ నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.

Related Posts
ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం
Cabinet approves AP Annual Budget

మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం Read more

వ్యూహాత్మక రీబ్రాండ్, గ్లోబల్ విస్తరణను ప్రారంభించిన పోసిడెక్స్ టెక్నాలజీస్
Posidex Technologies embarks on strategic rebrand global expansion

హైదరాబాద్: భారతదేశంలో కస్టమర్ మాస్టర్ డేటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రముఖ ప్రొవైడర్ పోసిడెక్స్ టెక్నాలజీస్ ప్రై.లి. వ్యూహాత్మక రీబ్రాండ్‌ను ఆవిష్కరించడంతో పాటు ప్రపంచ విస్తరణకు సంబంధించి తన Read more

ఫిట్‌ అండ్‌ హెల్తీ దేశంగా మారాలంటే.. ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి : ప్రధాని
If we want to become a fit and healthy country, we have to deal with the problem of obesity.. Prime Minister

10 మంది ప్రముఖులను నామినేట్‌ చేసిన మోడీ న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఊబకాయం సమస్య గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం తీవ్ర Read more

Pawan Kalyan: పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన
Pawan Kalyan: పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక చర్యగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×