tollplaza

టోల్ ప్లాజాలపై కేంద్రం కొత్త నిర్ణయం

ఏదయినా పండుగల సీజన్స్ లో ఊర్లకు వెళ్ళాలి అంటేనే టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్దీ వేచివుండాలి. ఇప్పుడు ఆ బాధలేదు. ఎందుకంటె జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాలకు చెక్ పడనుంది. ఫాస్టాగ్ విధానంలో టోల్ కలెక్షన్ల వ్యవస్థకు తెర దించబోతోంది కేంద్ర ప్రభుత్వం. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో భాగంగా అత్యాధునిక పద్ధతుల్లో టోల్ ఫీజులను వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం.

Advertisements

దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. ఇదివరకు జీపీఎస్ ఆధారంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కన్సల్టెంట్‌ను కూడా అపాయింట్ చేసింది. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పుడు కొత్తగా టోల్ పాసులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అవి కార్యాచరణలోకి వస్తే- రెండు రకాలుగా ఈ టోల్ పాసు అందుబాటులోకి ఉంటాయి. మొదటిది- వార్షిక టోల్ పాస్, రెండోది- లైఫ్ టైమ్ టోల్ పాస్వా ర్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు యథేచ్ఛగా రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. టోల్ గేట్ల గుండా ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చు. ఎక్కడే గానీ అదనంగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్‌ ప్రొవైడర్‌ అకౌంట్‌ లేదా వాలెట్‌లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచుకోనక్కర్లేదు. లైఫ్ టైమ్ టోల్ పాస్ ధర- 30,000 రూపాయలు. దీనికి కాలపరిమితి అంటూ ఏదీ ఉండదు.

Related Posts
మద్యం షాపులకు ఒక్క దరఖాస్తూ లేదు..షాక్ లో ఏపీ సర్కార్
wine shops telangana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లు గీత కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మద్యం షాపుల పాలసీని అమలు చేస్తోంది. ఈ క్రమంలో 339 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ, Read more

Jio News: అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో
అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో

దేశంలోని మీడియా రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అన్ లిమిటెడ్ ఆఫర్‌తో ప్రజల ముందుకు తిరిగి వచ్చేస్తోంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ మెుదలు Read more

కేజ్రీవాల్ కు రాహుల్ గాంధీ సవాల్
kejrival rahul gandhi

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని రాహుల్ ఆరోపించారు. ఇటు ఆప్ లో, అటు బీజేపీలో.. రెండు Read more

ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!
ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2025 లో ఇంటి యజమానులకు శుభవార్త లభించింది. కొత్త పన్ను ప్రయోజనాల ప్రకారం, స్వీయ-ఆక్రమిత గృహాలకు Read more

×