సూర్య రెట్రో చిత్రం మే 1న రాబోతోంది. ఈ క్రమంలో సూర్య హైదరాబాద్‌కు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్టుగా వచ్చి స్పీచ్ అదరగొట్టేశాడు.ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే సూర్య తన రాబోయే సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి, సితార నాగవంశీతో నెక్ట్స్ సినిమా ఉంటుందని అన్నాడు. అయితే తమిళ సినిమాగానే ఉంటుందని అంటున్నాడు సూర్య. ఈ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ ‘నేను ఒక వేళ రెట్రో టైంలోకి వెళ్తే నా 90వ దశకంలోని కాలేజీ రోజుల్లోకి వెళ్తాను అవే జీవితంలో గొప్ప రోజులు నేనే ఈ స్థాయికి వచ్చానంటే మీరు (ఆడియెన్స్, అభిమానులు) ఇంకా ఎంతో స్థాయికి వెళ్లగలరు ప్యాషన్, కష్టపడే తత్త్వం ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించొచ్చు మీలో (అభిమానులు) కొంత మంది చేతుల్ని చూశాను అక్కడ నా పేరుని టాటూగా వేయించుకున్నారు.నాకు ఇప్పటికే తెలుగు వాళ్లు ఎక్కువ ప్రేమను ఇచ్చారు నాకు అది చాలు అలా టాటూలు వేయించుకోకండి మీ కోసం మీరు కష్టపడండి లైఫ్‌లో సక్సెస్ సాధించండి ఈ రెట్రో సినిమా విషయానికి వస్తే ఇది కార్తీక్ సుబ్బరాజ్ సినిమా ఆయన మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది.ఆయన జానర్లు, చూపించిన విధానం అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి.ఇక ఇందులో సంతోష్ నారాయణ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ప్రకాష్ రాజ్, నాజర్ వంటి వారితో చాలా కాలం తరువాత నటించాను.
నెక్ట్స్ సినిమా
పూజా హెగ్డే నా కంటే ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేసింది,ఆమె ఈ రోజు బిజీగా ఉండటంతో రాలేదనుకుంటా మే 1న మీరంతా రెట్రోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నాగవంశీది లక్కీ హ్యాండ్ అని చాలా మంది చెబుతున్నారు,ఆయనతో చేతులు కలపడం ఆనందంగా ఉంది. అల్లు అరవింద్ గారి వల్ల నా ఈ జర్నీ తెలుగులో ప్రారంభమైంది. వెంకీ అట్లూరి, నాగవంశీలతో నెక్ట్స్ సినిమా చేయబోతోన్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్-3’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కింగ్ డమ్’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు’ అని సూర్య చెప్పుకొచ్చారు.
Read Also: Die Hard Fan: విజయ్‌ని కలిసేందుకు వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?