I have immense respect for Bhatti Vikramarka.

KTR: భట్టి విక్రమార్క పై నాకు అపారమైన గౌరవం ఉంది: కేటీఆర్‌

KTR: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స‌న‌స‌భ‌లో అధికార ప‌క్షంపై నిప్పులు చెరిగారు. కేటీఆర్‌ను ఉద్దేశించిన డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు మిగ‌తా స‌భ్యులు మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమ‌లు చేస్తామ‌న్న సంక్షేమ ప‌థ‌కాల‌పై నిల‌దీసే హ‌క్కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ఎస్ పార్టీకి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మేం స‌భ‌ను ప్రోవోక్ చేయాల‌నుకుంటే చేయొచ్చు.. 30 శాతం క‌మీష‌న్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. 20 శాతం క‌మీష‌న్ అని స‌చివాల‌యంలో ధ‌ర్నాలు చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

Advertisements
భట్టి విక్రమార్క పై నాకు అపారమైన

భ‌ట్టి గారంటే గౌర‌వం ఉంది. పెద్ద‌న్న‌లాగా గౌర‌విస్తాం

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్పందిస్తూ.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోని మాట్లాడాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు డిమాండ్ చేశారు. అనంత‌రం కేటీఆర్‌కు మాట్లాడేందుకు స్పీక‌ర్ అవ‌కాశం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009 నుంచి క‌లిసి ప‌నిచేస్తున్నాం. ఆయ‌న డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న‌ప్పుడు నేను తొలిసారి ఎమ్మెల్యేగా వ‌చ్చాను. ఆయ‌న‌తో మాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. గ‌త 16 ఏండ్ల నుంచి ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. భ‌ట్టి గారంటే గౌర‌వం ఉంది. పెద్ద‌న్న‌లాగా గౌర‌విస్తాం. ఆది శ్రీనివాస్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా?

ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. 30 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. దాని మీద చ‌ర్య తీసుకోండి అని రెవెన్యూ మినిస్ట‌ర్‌ను కోరాను. 20 శాతం క‌మీష‌న్లు తీసుకుంటున్నార‌ని కాంట్రాక్ట‌ర్లు స‌చివాల‌యంలో ధ‌ర్నా చేశారు. దాని మీద చ‌ర్య తీసుకోమ‌ని అడిగాను. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Related Posts
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా
Eknath Shinde resigns as Maharashtra CM

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట Read more

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Ilaiyaraaja ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ ఇటీవల లండన్‌లో చారిత్రాత్మకంగా 'వాలియెంట్' సింఫనీ ప్రదర్శించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నేడు దేశ ప్రధాని Read more

నా రాజకీయ భవిష్యత్తుపై దుష్ప్రచారం : ఆర్ఎస్ ప్రవీణ్
Bad publicity about my political future.. RS Praveen

హైదరాబాద్‌: తన రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Read more

Haryana: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఇన్‌స్టాలో ప్రేమ.. ఘోర హత్యకు దారితీసింది! హర్యానాలోని హిస్సార్ జిల్లా ప్రేమ్‌నగర్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×