టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో నిరాశపరిచినా, మళ్ళీ టాలీవుడ్ లో వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ముందుగా ‘భైరవం’ అనే చిత్రంతో థియేటర్లలోకి రాబోతున్నారు. మంచు మనోజ్, నారా రోహిత్ లతో కలిసి నటిస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అల్లుడు శ్రీను లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) మాట్లాడుతూ ఇతను అన్ని కథల్లో యాప్ట్ అవుతాడు, ఎలాంటి పాత్రకైనా సూట్ అవుతాడని ఆడియన్స్ తో అనిపించుకోవాలనేదే తన టార్గెట్ అని అన్నారు. షార్ట్ టర్మ్ లో వచ్చే సక్సెస్ తనకు వద్దని తొందరగా వచ్చే విజయం అంటే తనకు భయమని పేర్కొన్నారు. సినిమా బాగుంటేనే జనాలు ఆదరిస్తారని, అప్పట్లో ‘జయ జానకీ నాయక’ సినిమా బాగుంది కాబట్టే థియేటర్లలో ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్స్ రాబట్టిందని అన్నారు. ఈ సందర్భంగా ఆ మూవీ రిలీజ్ టైంలో కాంపిటీషన్ గురించి సాయి శ్రీనివాస్ మాట్లాడారు.

విజయం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన చిత్రం ‘జయ జానకీ నాయక’. 2017 ఆగస్టులో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దీనిపై యువ హీరో స్పందిస్తూ “జయ జానకీ నాయక(Jaya Janaki Nayaka) మూడు సినిమాలతో పోటీగా రిలీజ్ అయింది. చాలా టెన్షన్ పడ్డాం. నితిన్ ‘లై’, ‘రానా నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలతో పాటుగా వచ్చాం. తర్వాతి వారంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలైంది. క్రేజ్ అంతా అటు పోయింది. ఎంత కష్టపడినా, ఎన్ని చేసినా ఇంతే కదా అని అప్పుడు అనిపించింది” అని అన్నారు.మూడు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అయినప్పుడు,మూడో సినిమాలో హీరోని మాత్రమే. నేనప్పుడు చిన్నవాడిని. నాకు 23 ఏళ్లు. బోయపాటి శ్రీను అప్పుడు బన్నీతో సినిమా చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. సడన్ గా స్టార్ డమ్ రావాలంటే రాదు. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు హీరోగా లాంచ్ అయ్యా ఇప్పుడు 30 ఏళ్లు వచ్చాయి. ఈ పదేళ్ల కెరీర్ లో ఇక్కడి దాకా వచ్చాను.” అని బెల్లంకొండ శ్రీను అన్నారు. ‘జయ జానకీ నాయక’ మూడు సినిమాలతో పోటీగా రాకుండా ఉండుంటే ఇంకా మంచి సక్సెస్ సాధించేదని అభిప్రాయ పడ్డారు.
Read Also: Hit 3 OTT : త్వరలో ఓటీటీలో నాని హిట్-3 సినిమా : ఎపుడంటే