हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Anusha
Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన జారీ చేశారు.రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు (Gusty winds) వీచే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.రేపు (జూన్ 25) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

ప్రభావంతో రాష్ట్రంలో

ఈ జిల్లాలకు సైతం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒడిశా (Odisha) తీరం ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు.ఇక తెలంగాణలో  ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. మే చివరి వారంలోనే నైరుతి పలకరించినా వర్షాలు మాత్రం కురవలేదు. 

Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..నేడు పలు జిల్లాల్లో వర్షాలు
Rain

లోటు వర్షపాతం

ఈ జూన్ 23 నాటికి తెలంగాణలో సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 56.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 42 శాతం లోటు వర్షపాతంగా నమోదైంది. గత ఏడాది జూన్‌ (June) తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత సంవత్సరం ఇదే రోజు నాటికి 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గతేడాది జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం 51 శాతం లోటు వర్షపాతం ఉండటం గమనార్హం.

Read Also: Jeedimetla: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870