हिन्दी | Epaper

Mahila Shakthi: మహిళా శక్తి చీరెల కుట్టుకూలీ నిర్ణయంలో జాప్యం

Anusha
Mahila Shakthi: మహిళా శక్తి చీరెల కుట్టుకూలీ నిర్ణయంలో జాప్యం

ఆలస్యం కానున్న చీరెల పంపిణీ

హైదరాబాద్ : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మహిళాశక్తి చీరెల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. నూలు సిద్ధమైనా కూలి రేటు ఖరారు కాకపోవడంతో ఉత్పత్తి ఆలస్యమవుతున్నట్లు సమాచారం. బతుకమ్మ చీరెల మాదిరిగానే మీటరుకు రూ.34 చొప్పున చెల్లిస్తామని సర్కారు మెలిక పెడుతుండడంతో కార్మికులు తయారీకి ముందుకు రావడం లేదు. దీంతో మహిళా సంఘాల్లోని సభ్యులకు ఆగస్టు 15 నాటికి చీరల పంపిణీ (Distribution of sarees) సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 65 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తామని, 2024 ఆగస్టు 8న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహిళా శక్తి చీరలకు ఆర్డర్లు

బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ పండుగకు పంపిణీ చేయ కపోగా, సంక్రాంతికి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వరుసగా వాయిదాలు వేస్తూ పోతున్నా. చేనేత జౌళిశాఖ అధికారులు చేనేత చర్యలు చేపట్టలేదు. 2025 జనవరిలో ఒక విడత, మార్చిలో రెండో విడత చీరల కోసం వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు. అయితే సిరిసిల్లలో 26 వేల మరమగ్గాలు ఉండగా కేవలం 2 వేల సాంచాలపైనే వస్తోత్పత్తి చేయాలని నిర్ణయించారు. రెండు విడుతల్లో కలిపి చేనేత జౌళిశాఖ 4.24 కోట్ల మహిళా శక్తి (Mahila Shakthi) చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఆసాములు, కార్మికులకు ఇచ్చే కూలీ రేటు. నిర్ణయించలేదు గతంలో బతుకమ్మ చీరలకు మీటరకు రూ.34 చొప్పున చెల్లించే వారు ఇందులో ఆసాములకు రూ.11, కార్మికులకు రూ. 5 చొప్పున చెల్లించేవారు ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నట్టుగా కాటన్ చీర ఉత్పత్తి చేయాలంటే పనిభారం ఎక్కువగా ఉంటుందని, కూలీ పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Mahila Shakthi

బతుకమ్మ పండుగనాటికి

కనీసం మీటరకు రూ.2 చొప్పున అంటే ఆసాములకు రూ. 13. కార్మికులకు రూ.7 చొప్పున ఇవ్వాలని కోరుతు న్నారు. లేకపోతే నెలకు రూ 10 వేలు కూడావచ్చే పరిస్థితిలేదని వాపోతున్నారు. కార్మికుల విజప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వస్త్ర ఉత్పత్తి మొదలు పట్టించుకోకపోవడంతో కాలేదు.ముఖ్యమంత్రి ప్రకటించి నెలలవుతున్నా చీరల తయారీ ప్రారంభంకాలేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 1.50 కోట్ల బతుకమ్మ చీరల (Bathukamma sarees) ఉత్పత్తికి తొమ్మది పది నెలల ముందే ఆర్డర్లు ఇచ్చేది. ఉరుకులు పరుగుల మీద చేస్తేనే బతుకమ్మ పండుగనాటికి చీరలు సిద్ధమయ్యేవి కానీ ఈ ఏడాది ఆగస్టు 15న వాటికి చీరలు అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇందుకు 45 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చీరలు అందే పరిస్థితి ఉండదని, కనీసం బతుకమ్మ పండుగకు కూడా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసే పరిస్థితి కనిపించడంలేదని అధికారులు పేర్కొంటున్నారు.

Read Also: Adluri Lakshman: అన్ని స్కూళ్లల్లో ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ అమలు చేయాలి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870