हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

News Telugu: Lilly: మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు.. ముందుకొచ్చిన ఎలి లిల్లీ

Rajitha
News Telugu: Lilly: మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు.. ముందుకొచ్చిన ఎలి లిల్లీ

ముందుకొచ్చిన అమెరికా కంపెనీ ఎలి లిల్లీ Eli Lilly హైదరాబాద్ : తెలంగాణ మరో సారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని Revanth Reddy కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో Telangana భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై ఎస్‌ఈసీ కీలక స్పష్టత

Lilly

Lilly

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది.

మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ ఆధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్ లో ఈ ఏడాది ఆగస్ట్ లోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కంపెనీ బారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వ కారణమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మ హబ్గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

1965లో ఇందిరా గాంధీ హైదరాబాదుకు ఐడీపీఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్ మారిందన్నారు. హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. చేస్తున్నామని చెప్పారు. ఫార్కు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్గా ఉన్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మంత్రి శ్రీదర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్లో ఎల్ లిల్లీ కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందని అన్నారు. ఎల్ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని అన్నారు.

ఎల్ లిల్లీ కంపెనీ హైదరాబాద్‌లో ఏ కారణంగా మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తోంది?
దేశంలోనే తొలి సారిగా హైదరాబాద్‌లో మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించేందుకు.

ఈ పెట్టుబడుల మొత్తం ఎంత?
ఒక బిలియన్ డాలర్లుగా, సుమారు రూ.9,000 కోట్లు.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగిందన్న హరీశ్ రావు

బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?

బతుకమ్మ కుంటకు ఆ కాంగ్రెస్ నేత పేరు ?

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సిగాచి బాధితులకు పరిహారం.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక .. నిందుతుడు అరెస్ట్

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

మేడారంలో మూడో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ

మేడారంలో మూడో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ

మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదంటే ?

మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదంటే ?

కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్

కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు – BRS లాయర్

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870